
భువనేశ్వర్: ఒడిశాలోని కేంద్రపర లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేడీ సభ్యుడు వైజయంత్ పండా సోమవారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆయన బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు పెరిగాయి. ఒడిశా సీఎం, బీజేడీ అధ్యక్షుడు పట్నాయక్‌తో వైజయంత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే వైజయంత్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నవీన్‌కు పండా ఓ లేఖ రాస్తూ ‘బీజేడీ వ్యవస్థాపకుడు బిజూకు మా నాన్న సన్నిహితుడు. నాన్న అంత్యక్రియలకు పార్టీ వారెవరూ రాకుండా అడ్డుకోవడం బాధించింది. అందుకే బయటకు వెళ్తున్నా’ అని రాశారు.
Comments
Please login to add a commentAdd a comment