
హైదరాబాద్ సీనియర్ మహిళల క్రికెట్ జట్టు వికెట్ కీపర్ మమతకు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ ప్రోత్సాహక నగదు బహుమతి అందించారు. ఇటీవల అండర్–19 చాలెంజర్ ట్రోఫీలో ఇండియా ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మమతకు చాముండేశ్వరీనాథ్ రూ. 5 లక్షల చెక్‌ను ప్రదానం చేశారు.
ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రాంజల
నవీ ముంబై: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రాంజల 6–4, 5–7, 6–1తో వైదేహి (భారత్) పై గెలిచింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్‌కే చెందిన రష్మిక 2–6, 4–6తో డయానా (లాత్వియా) చేతిలో ఓడింది.
చదవండి: INDIA Vs South Africa: షమీ చేతిలో సఫారీ సఫా.. 197 ఆలౌట్.. భారత్‌కు భారీ ఆధిక్యం