Chamundeshwari Nath
-
మమతకు చాముండేశ్వరీనాథ్ రూ. 5 లక్షల చెక్
హైదరాబాద్ సీనియర్ మహిళల క్రికెట్ జట్టు వికెట్ కీపర్ మమతకు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ ప్రోత్సాహక నగదు బహుమతి అందించారు. ఇటీవల అండర్–19 చాలెంజర్ ట్రోఫీలో ఇండియా ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మమతకు చాముండేశ్వరీనాథ్ రూ. 5 లక్షల చెక్‌ను ప్రదానం చేశారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రాంజల నవీ ముంబై: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో ప్రాంజల 6–4, 5–7, 6–1తో వైదేహి (భారత్) పై గెలిచింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్‌కే చెందిన రష్మిక 2–6, 4–6తో డయానా (లాత్వియా) చేతిలో ఓడింది. చదవండి: INDIA Vs South Africa: షమీ చేతిలో సఫారీ సఫా.. 197 ఆలౌట్.. భారత్‌కు భారీ ఆధిక్యం -
విజేత చాముండేశ్వరీనాథ్
సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం పోర్ట్స్ గోల్ఫ్ టోర్నమెంట్లో మాజీ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ ‘హిట్ ద వింగ్స్’ కేటగిరీలో విజేతగా నిలిచాడు. హైదరాబాద్‌లోని బౌల్డర్‌హిల్స్‌లో జరిగిన ఈ టోర్నీలో 200 మంది కంటే ఎక్కువ మంది గోల్ఫర్లు పాల్గొన్నారు. కృష్ణపట్నం పోర్ట్ ఆధ్వర్యంలో ఈ టోర్నీని ప్రతి ఏడాది దుబాయ్, ఢిల్లీ, బెంగళూరు, పుణే, హైదరాబాద్‌లలో నిర్వహిస్తారు. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశాడు. ఈ కార్యక్రమంలో భారత మహిళల గోల్ఫ్ సంఘానికి (డబ్ల్యూజీఏఐ) ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’’ సభ్యులు త్వెసా మలిక్, రిధిమ దిలావరీ, భారత స్టార్ గోల్ఫర్ షర్మిలా నికోలెట్, బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తనయుడు ప్రశాంత్ కుమార్, కృష్ణపట్నం పోర్ట్ ఎండీ శశిధర్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్యం ‘టోక్యో’...: వరుసగా ఎనిమిదో ఒలింపిక్స్‌లో పాల్గొనడమే తన లక్ష్యమని లియాండర్ పేస్ తెలిపాడు. గోల్ఫ్ టోర్నీనలో బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా మాట్లాడిన పేస్ హైదరాబాద్ నగరమంటే తనకెంతో ఇష్టమని అన్నాడు. -
సింధు సన్నాహాలకు సహకారం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలవడం ద్వారా పీవీ సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనేందుకు, సిద్ధమయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వపరంగా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. పీవీ సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్ గోపీచంద్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ బుధవారం ప్రగతి భవన్లో కేసీఆర్‌ను కలిశారు. తనకు వచ్చిన గోల్డ్ మెడల్‌ను కేసీఆర్‌కు సింధు చూపించింది. రెండు రాకెట్లను కూడా సీఎంకు బహూకరించింది. ఈ సందర్భంగా సింధుకు సీఎం పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సన్మానించారు. ‘పీవీ సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టింది. ప్రపంచ చాంపియన్‌షిప్ గెలవడం ద్వారా 130 కోట్ల మంది భారతీయులు గర్వపడేలా చేసింది. ఇలాంటి ఘనతలు సాధించడం ఆషామాషీ విషయం కాదు. కఠోర సాధన, శ్రమ, శ్రద్ధ అవసరం. ఎంతో కష్టపడితే తప్ప ఈ స్థితికి చేరుకోవడం సాధ్యంకాదు’ అని వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్ సహా సింధు భవిష్యత్తులో పాల్గొనే టోర్నమెంట్లకు సమాయత్తం కావడానికి, ఇతరత్రా ఏర్పాట్లకు సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, వీసీ సజ్జనార్, మహేశ్ భగవత్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్ తదితరులు పాల్గొన్నారు. టోక్యోలో స్వర్ణం ఖాయం: గవర్నర్ నరసింహన్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన తెలుగుతేజం పీవీ సింధుపై తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రశంసలు కురిపించారు. వచ్చే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె బంగారు పతకం సాధించడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన సింధు నేటి తరానికి ఆదర్శమని గవర్నర్ నరసింహన్ కొనియాడారు. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన సింధుతో పాటు, పారా బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించిన మానసి జోషిలను బుధవారం గవర్నర్ దంపతులు సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ ‘పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చని సింధు, మానసి నిరూపించారు. వీరు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణం. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి మళ్లీ రాజ్‌భవన్‌కు రావాలని కోరుకుంటున్నా’ అని గవర్నర్ ఆకాంక్షించారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తాము నెగ్గిన స్వర్ణ పతకాలను గవర్నర్‌కు చూపిస్తున్న మానసి, సింధు -
అంధ క్రికెటర్‌కు ఆర్థిక సహాయం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన భారత అంధుల క్రికెట్ జట్టులో సభ్యుడైన మహేందర్ వైష్ణవ్‌కు టీటీఎల్ జట్ల యజమానులు రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఉప్పల్‌లో టీటీఎల్ ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో మహేందర్‌కు ఈ చెక్‌ను రంగారెడ్డి రైజర్స్ జట్టు యజమాని చాముండేశ్వరీనాథ్ అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు పాల్గొన్నారు. చాముండేశ్వరీనాథ్ క్రీడాకారులను ప్రోత్సహించడం ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు 1972 నుంచి పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు తలా 15 లక్షల చొప్పున మొత్తం రూ. 1.75 కోట్లను అందించాడు. ఇందుకోసం చాముండి, భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ చెరో 50 లక్షలు ఇవ్వగా... మిగతా 75 లక్షలను ఇతరుల నుంచి సేకరించారు. తాజాగా ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో కాంస్యం సాధించిన బుద్ధా అరుణరెడ్డికి శిక్షణ కోసం రూ.6.5 లక్షలు ప్రోత్సాహకాన్ని అందజేశారు. -
కారు బహుమతిగా అందుకున్న కెప్టెన్
-
ప్రోత్సాహానికి చాలా సంతోషం!
మిథాలీ రాజ్ వ్యాఖ్య ∙కారు బహుమతిగా అందుకున్న కెప్టెన్ హైదరాబాద్: ప్రపంచ కప్‌లో ఫైనల్ చేరిన అనంతరం అన్ని వైపుల నుంచి తమకు అందుకున్న ప్రోత్సాహకాలపై భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు రావడం మంచి పరిణామమని ఆమె చెప్పింది. భారత క్రికెట్ జూనియర్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్, మిథాలీ రాజ్‌కు మంగళవారం ప్రత్యేకంగా బీఎండబ్ల్యూ 320డి సిరీస్ కారును బహుమతిగా అందజేశారు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచినందుకు ఆమెకు ఈ కానుక ఇస్తున్నట్లు చాముండి చెప్పారు. మిథాలీ కెరీర్ ఆరంభంలో కూడా ఆయన ఇదే తరహాలో కారును బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మిథాలీ మాట్లాడుతూ ‘ఆటగాళ్లకు ఈ తరహా ప్రోత్సాహకాలు ఉత్ప్రేరకంగా పని చేస్తాయి. క్రీడాకారులకు చాముండి ఇస్తున్న మద్దతు అమూల్యం. గతంలో కూడా అనేక సార్లు ఆయన గిఫ్ట్‌గా ఇచ్చిన బ్యాట్లతో భారీగా పరుగులు సాధించాను’ అని గుర్తు చేసుకుంది. మరోవైపు మ్యాక్సీ విజన్ సంస్థ జీవితకాలం మిథాలీ కుటుంబానికి ఉచిత చికిత్స అందించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో మ్యాక్సీ సంస్థ ప్రతినిధి డాక్టర్ వెల్లా, బయోలాజికల్ ఇవాన్స్ ఎండీ మహిమా దత్తా తదితరులు పాల్గొన్నారు. -
వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో..
సాక్షి, తిరుమల: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆరంభంలోనే వెంటవెంటనే వికెట్లు కోల్పోవడమే భారత విజయావకాశాలను దెబ్బతీసిందని హైదరాబాద్ జిల్లా బాడ్మింటన్ సంఘం (హెచ్‌డీబీఏ) అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌తో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కీలకమైన వికెట్లను భారత జట్టు తక్కువ సమయంలోనే కోల్పోయింది. దాంతో పాకిస్తాన్ విజయం సులువైంది. పేస్ బౌలర్ ఆమిర్ అద్భుత ప్రతిభ కనబరిచాడు’ అని ఆయన అన్నారు. -
‘ఆల్ ఇంగ్లండ్’ పరిశీలకుడిగా చాముండేశ్వరీనాథ్
హైదరాబాద్: తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి. చాముండేశ్వరీనాథ్‌కు అరుదైన అవకాశం దక్కింది. వచ్చే నెలలో జరిగే ప్రతిష్టాత్మక ‘ఆల్ ఇంగ్లండ్ టోర్నీ’కి ఆయన భారత జట్టు తరఫున పరిశీలకుడిగా నియమితులయ్యారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) చాముండికి ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ మెగా టోర్నమెంట్లో భారత్ నుంచి 11 మంది షట్లర్లు పాల్గొంటున్నారు. మార్చి 7 నుంచి 12 వరకు బర్మింగ్‌హామ్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన చాముండి ప్రస్తుతం హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన ఇంగ్లండ్‌లోనే జరిగిన 2009 టి20 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించారు. -
విశాఖ స్మృతుల్లో ‘మాస్టర్’సచిన్ ఇన్నింగ్స్
క్రీడావినీలాకాశంలో అసమాన కాంతితో ప్రకాశించే ఉజ్వల భానుడతడు.. భారత క్రికెట్లో అనితర సాధ్యుడు... క్రికెట్‌నే శ్వాసించే అభిమానులకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఆరాధ్యుడు.. విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాల్లో మహిమాన్వితుడు.. ఒక్కమాటలో చెప్పాలంటే భారత క్రికెట్లో ఆదర్శనీయుడు. రెండు దశాబ్దాలకు మించిన సుదీర్ఘ కాలంలో భారత క్రికెట్‌కు, ఆ మాటకొస్తే ప్రపంచ క్రికెట్‌కు కేంద్రమనదగ్గ ఖ్యాతిని సంపాదించిన వాడు.. అసాధారణ రికార్డులు సృష్టించి, మళ్లీ తానే వాటిని తిరగరాసి అభిమానులను అలరించిన ప్రతిభావంతుడు. ఇన్ని విశేషణాలకు ప్రతీకగా నిలిచే సత్తా ఉన్న వాడు.. మాస్టర్‌బ్లాస్టర్.. లిటిల్ మాస్టర్.. ఒకే ఒక్కడు! క్రికెట్ రారాజుగా వన్నె కెక్కిన ‘మాస్టర్’ థండర్ టెండూల్కర్ ఇక తనకు ఆరోప్రాణమైన ఆటకు వీడ్కోలు చెప్పే తరుణం ఆసన్నమైందని ప్రకటించాడు. తన 200వ టెస్ట్ తర్వాత ఇక సెలవని నిష్ర్కమించనున్నట్టు తెలిపాడు. అభిమానులకు అంతులేని నిరాశ కలిగిస్తున్నా.. ఇక తెరమరుగుకు తప్పుకోక తప్పదని ప్రకటించాడు. మాస్టర్ ప్రభంజనాన్ని మళ్లీ చూడలేమన్న బాధ సహజంగానే విశాఖ క్రీడాభిమానులను సైతం వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో విశాఖలో మాస్టర్ మెరుపులపై ‘సాక్షి’ విహంగ వీక్షణమిది. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన తొలినాళ్ళలోనే సచిన్ టెండూల్కర్ విశాఖ వాసులతో బంధం పెనవేసుకున్నాడు. భారత్ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ జట్టు మ్యాచ్‌లాడేందుకు వచ్చింది. సిరీస్ ప్రారంభానికి ముందు మూడు రోజుల మ్యాచ్ మున్సిపల్ స్టేడియం జరిగినప్పుడు సచిన్ దర్శనమిచ్చాడు. తొలిసారిగా 2001 ఏప్రిల్ 3న విశాఖ వేదికగా జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో తన సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ వన్డేమ్యాచ్లో విశాఖ క్రీడాభిమానులకు సచిన్ అర్ధసెంచరీతో అలరించాడు. విశాఖలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ 1988లో ప్రారంభం కాగా, మరో ఏడాదికే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆరంగేట్రం చేశాడు సచిన్. విశాఖలో క్రికెట్ మ్యాచ్‌లకు శ్రీకారం పడిన తొలినాళ్ళలోనే సచిన్ కెరీర్ తొలి అడుగులు పడుతున్న వేళ కావడం కాకతాళీయమే అయింది. విశాఖలో చివరిసారిగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ముంబయి ఇండియన్స్ తరఫున డెక్కన్చార్జర్స్తో ఆడేందుకు వ చ్చినా చేతికి గాయంతో ఆడలేక పోయాడు. వినమ్రతే విజయానికి కారణం సచిన్ వినమ్రత అతనిని క్రికెట్ ప్రపంచంలో దిగ్గజంగా నిలిపింది. 1997లో వెస్టీండీస్ పర్యటనకు మేనేజర్‌గా వ్యవహరించాను. మూడున్నర నెలల పాటు సచిన్‌తో గడిపాను. అప్పుడు ఎలాంటి ప్రవర్తన అతనిలో చూశానో, నేటికీ అదే ప్రవర్తన, అదే వినయం. -డి.వి.సుబ్బారావు, ఏసీఏ అధ్యక్షుడు. ఇన్స్పిరేషన్ సచినే ఔత్సాహిక క్రికెటర్లకు సచిన్ ఒక ఐకాన్. స్పూర్తిప్రదాత. చిన్నప్పటి నుంచి అయనంటే ఎంతో అభిమానం. బ్యాట్స్‌మెన్‌గా ఆయన్ని చూసి ఎంతో నేర్చుకున్నాను. - రికీబుయ్, ఔత్సాహిక అంతర్జాతీయ -19 క్రికెటర్. భారతరత్న ఇవ్వాలి సచిన్ ఒక్క క్రికెట్లోనే కాదు.. అతని అన్ని ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్‌లోనూ రోల్‌మోడల్. దేశానికి నిజాయితీగా సేవలందించాడు. అలాంటి వ్యక్తికి భారతరత్నతో గౌరవించాలి. ఔత్సాహిక క్రికెటర్లకు ఆయన చక్కటి సూచనలిస్తాడు. - ఎం.ఎస్.కె.ప్రసాద్, ఏసీఏ మహిళా క్రికెట్ అకాడమీ ప్రతినిధి. యంగ్‌స్టర్స్‌కు ప్రోత్సాహం సచిన్, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటన అనుకున్నదే. ఆయన చక్కటి క్రికెట్ ఆడాడు. అంతకు మించిన రికార్డుల్ని సొంతం చేసుకున్నా వినమ్రతతో మెలిగాడు. ఆయన రిటైర్మెంట్తో యంగ్‌స్టర్స్‌కు అవకాశం కల్పించాలనే ఉద్దేశం ఉంది. - చాముండేశ్వరీనాథ్, మాజీ కార్యదర్శి, ఏసీఏ.