వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో.. | losing wickets quickly affected on victory of indian team | Sakshi
Sakshi News home page

వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో..

Published Tue, Jun 20 2017 10:36 AM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM

వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో..

వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో..

సాక్షి, తిరుమల: చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో ఆరంభంలోనే వెంటవెంటనే వికెట్లు కోల్పోవడమే భారత విజయావకాశాలను దెబ్బతీసిందని హైదరాబాద్‌ జిల్లా బాడ్మింటన్‌ సంఘం (హెచ్‌డీబీఏ) అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌తో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు.

 

అనంతరం ఆయన  ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో కీలకమైన వికెట్లను భారత జట్టు తక్కువ సమయంలోనే కోల్పోయింది. దాంతో పాకిస్తాన్‌ విజయం సులువైంది. పేస్‌ బౌలర్‌ ఆమిర్‌ అద్భుత ప్రతిభ కనబరిచాడు’ అని ఆయన అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement