
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన భారత అంధుల క్రికెట్ జట్టులో సభ్యుడైన మహేందర్ వైష్ణవ్‌కు టీటీఎల్ జట్ల యజమానులు రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఉప్పల్‌లో టీటీఎల్ ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో మహేందర్‌కు ఈ చెక్‌ను రంగారెడ్డి రైజర్స్ జట్టు యజమాని చాముండేశ్వరీనాథ్ అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు పాల్గొన్నారు.
చాముండేశ్వరీనాథ్ క్రీడాకారులను ప్రోత్సహించడం ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు 1972 నుంచి పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు తలా 15 లక్షల చొప్పున మొత్తం రూ. 1.75 కోట్లను అందించాడు. ఇందుకోసం చాముండి, భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ చెరో 50 లక్షలు ఇవ్వగా... మిగతా 75 లక్షలను ఇతరుల నుంచి సేకరించారు. తాజాగా ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో కాంస్యం సాధించిన బుద్ధా అరుణరెడ్డికి శిక్షణ కోసం రూ.6.5 లక్షలు ప్రోత్సాహకాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment