ఎదురులేని హైదరాబాద్‌ | hyderabad sixth ttl victory in a row | Sakshi
Sakshi News home page

ఎదురులేని హైదరాబాద్‌

Published Tue, Feb 20 2018 10:30 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

hyderabad sixth ttl victory in a row - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 క్రికెట్‌ లీగ్‌లో హైదరాబాద్‌ థండర్‌బోల్ట్స్‌ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 17 పరుగుల తేడాతో రంగారెడ్డి రైజర్స్‌పై విజయం సాధించింది. ఇది హైదరాబాద్‌కు వరుసగా ఆరో విజయం. టోర్నీలో 7 మ్యాచ్‌లాడిన థండర్‌బోల్ట్స్‌ జట్టు 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. బ్యాటింగ్‌లో చందన్‌ సహాని (49 బంతుల్లో 84; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎస్‌కే చైతన్య (41 బంతుల్లో 63; 9 ఫోర్లు, ఒక సిక్స్‌) ధాటిగా ఆడటంతో మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు సాధించింది. అనంతరం రంగారెడ్డి జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రతీక్‌ పవార్‌ (53 బంతుల్లో 85; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్‌ బౌలర్లలో విఠల్‌ అనురాగ్, జయరావ్‌ రెడ్డి చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.  

ఇతర మ్యాచ్‌ల వివరాలు

కరీంనగర్‌ వారియర్స్‌: 188/2 (బుద్ధి రాహుల్‌ 71 నాటౌట్, అశ్విన్‌ బాబు 57 నాటౌట్‌), కాకతీయ కింగ్స్‌: 133/5 (ప్రజ్ఞయ్‌ రెడ్డి 48 నాటౌట్‌; ఆకాశ్‌ రావు 2/26, విద్యానంద రెడ్డి 2/17).  
ఎంఎల్‌ఆర్‌ రాయల్స్‌ మహబూబ్‌నగర్‌: 104 (జె. మహేశ్‌ బాబు 39, ప్రణీత్‌ రాజ్‌ 5/16), మెదక్‌ మావెరిక్స్‌: 108/2 (అభిరత్‌ రెడ్డి 65).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement