సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం పోర్ట్స్ గోల్ఫ్ టోర్నమెంట్‌లో మాజీ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ ‘హిట్ ద వింగ్స్’ కేటగిరీలో విజేతగా నిలిచాడు. హైదరాబాద్‌లోని బౌల్డర్‌హిల్స్‌లో జరిగిన ఈ టోర్నీలో 200 మంది కంటే ఎక్కువ మంది గోల్ఫర్లు పాల్గొన్నారు. కృష్ణపట్నం పోర్ట్ ఆధ్వర్యంలో ఈ టోర్నీని ప్రతి ఏడాది దుబాయ్, ఢిల్లీ, బెంగళూరు, పుణే, హైదరాబాద్‌లలో నిర్వహిస్తారు. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశాడు.
ఈ కార్యక్రమంలో భారత మహిళల గోల్ఫ్ సంఘానికి (డబ్ల్యూజీఏఐ) ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’’ సభ్యులు త్వెసా మలిక్, రిధిమ దిలావరీ, భారత స్టార్ గోల్ఫర్ షర్మిలా నికోలెట్, బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తనయుడు ప్రశాంత్ కుమార్, కృష్ణపట్నం పోర్ట్ ఎండీ శశిధర్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యం ‘టోక్యో’...: వరుసగా ఎనిమిదో ఒలింపిక్స్‌లో పాల్గొనడమే తన లక్ష్యమని లియాండర్ పేస్ తెలిపాడు. గోల్ఫ్ టోర్నీనలో బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా మాట్లాడిన పేస్ హైదరాబాద్ నగరమంటే తనకెంతో ఇష్టమని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment