మిత్రా బెయిల్పై మమత 'నో కామెంట్స్' | Mamata refuses to comment on Madan Mitra's bail | Sakshi
Sakshi News home page

మిత్రా బెయిల్పై మమత 'నో కామెంట్స్'

Published Sun, Nov 1 2015 6:49 PM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

Mamata refuses to comment on Madan Mitra's bail

పశ్చిమ బెంగాల్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా కుంభకోణంలో నిందితుడు, తన మంత్రి వర్గ సభ్యుడు మదన్ మిత్రాకు బెయిల్ లభించడంపై మాట్లాడడానికి  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరాకరించారు. శారదా కుంభకోణం కేసులో గత సంవత్సరం డిసెంబర్ 12 న క్రీడలు, రవాణా మంత్రిగా పనిచేస్తున్న మదన్ మిత్రాను సీబీఐ అరెస్టు చేసింది. కాగా శనివారం ఆయనకు సిటీకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు విషయంపై మమతా బెనర్జి మాట్లాడుతూ.. 'అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశమైనందున దానిపై నేను మాట్లాడలేను' అని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement