
అపార్ట్‌మెంటుపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
అంబర్‌పేట: అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఏపీ ఆనంద్ కుమార్ కథనం ప్రకారం... ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న భవనంపై ఓ యువతి కిందకు దూకింది. చెట్టుపై పడి ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రగా వెళ్తున్న యువకులు చెట్ల కొమ్మల్లో చిక్కుకున్న ఆమెను కిందకి దింపి పోలీసులకు సమాచారం అందించారు.
హత్యా.. ఆత్మహత్య?
అంబర్‌పేట సీపీఎల్ రోడ్డులో సాయి దుర్గా రెసిడెన్సీ ఐదు అంతస్తుల భవనంపై నుంచి సుమారు 25 సంవత్సరాల గుర్తుతెలియని యువతి దూకిందని సమాచారం అందిందన్నారు. అక్కడి వారిని ఆరా తీయగా ఆమె ఎవరో తెలియదని అపార్ట్‌మెంట్ వాసులు తెలిపారు. దీంతో మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించామన్నారు. విచారణ చేపట్టిన పోలీసులు మృతురాలు ప్రేమ్‌నగర్‌లో నివసించే శంకర్, పుష్పల కూతురు మమత(25) అని గుర్తించారు. తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో స్నేహితురాలి ఇంటికి వెళ్తానని ఇంట్లో చెప్పి ఆత్మహత్య చేసుకుందని వారు పోలీసులతో కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తెకు మానసికస్థితి సరిగ్గా ఉండేది కాదని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యా..? ఆత్మహత్య? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.