‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’
న్యూయార్క్: తోటివారిని రక్షించడం కోసం తన ప్రాణాలు సైతం ఇబ్బందుల్లో పెట్టుకోవడం తనకు సంతోషంగానే అనిపించదని కాన్సాస్ కాల్పుల్లో గాయపడిన ఇయాన్ గ్రిల్లాట్ చెప్పాడు. దుండగుడు భయంకరంగా కాల్పులు జరుపుతుంటే చూస్తూ ఉండలేకపోయానని, ఏదో ఒకటి చేయాలనే తాను అతడిపైకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. జాత్యహంకారంతో కాన్సాస్‌లోని ఆస్టిన్ బార్‌లో మా దేశం విడిచి వెళ్లిపోండి అని గట్టిగా అరుస్తూ ఇద్దరు తెలుగువారిపై దుండగుడు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో శ్రీనివాస్ కూచిబొట్ల చనిపోగా అలోక్ మాదసాని గాయపడ్డాడు. ఈ దాడిలోనే అలోక్ కంటే కూడా దారుణంగా ఇయాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరంతా ఒక టేబుల్‌పై కూర్చుని ఉండగా దుండగులు కాల్పులు ప్రారంభించి తొమ్మిది రౌండ్లు కాల్చిన అనంతరం ఎక్కడివారు అక్కడ భయాందోళనలతో చెల్లాచెదురుగా పరుగెడుతుండగా ఒక్క ఇయాన్ మాత్రం ఆ దుండగుడిపైకి ఉరికాడు. దాంతో అతడిపైకి కూడా దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఒక బుల్లెట్ అతడి చాతీలోకి, మరొకటి చేతిలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్న అతడిని మీడియా పలకరించింది.
మీకు జరిగిన హానీని ఊహించుకొని బాధపడుతున్నారా అని మీడియా ప్రశ్నించగా.. ‘ఇతరుల ప్రాణాలు రక్షించేందుకు నా ప్రాణాలు పణంగా పెట్టే ప్రయత్నం చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ సమయంలో బార్‌లో చాలా కుటుంబాలు ఉన్నాయి. పిల్లలు కూడా లోపల ఉన్నారు. అతడు అలా కాల్పులు జరుపుతుంటే చూస్తూ ఉండలేకపోయాను. ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకే నేను చేయాలనుకుంది చేసేశాను’ అని చెప్పాడు.
సంబంధిత వార్తా కథనాలకై చదవండి..
రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే
శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి
అమెరికాలో జాతి విద్వేష కాల్పులు
శ్రీనివాస్ కుటుంబానికి ఎన్‌ఆర్‌ఐల బాసట