వైట్ హౌస్ ఒప్పుకుంది
వాషింగ్టన్: తెలుగు ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యను అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఖండిచింది. కూచిభొట్ల శ్రీనివాస్ ది జాత్యంహకార హత్యగా అంగీకరించింది. జాతి వివక్షతో కూడిన దాడిగా వర్ణించింది. ఇలాంటి ఘటనలను సహించబోమని స్పష్టం చేసింది. ‘ఇప్పటివరకు వెల్లడైన వాస్తవాలను బట్టి చూస్తే కాన్సస్ కాల్పులు.. జాతి వివక్షతో కూడిన విద్వేష దాడిగా రూడీ అవుతోంది. జాత్యంహకార దాడులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండిస్తారు. ఇటువంటి దాడులను సహింబోమ’ని వైట్ హౌస్ అధికార ప్రతినిధి సారా శాండర్స్ మీడియాతో అన్నారు.
మరోవైపు కూచిభొట్ల శ్రీనివాస్ మృతికి అమెరికా కాంగ్రెస్ సంతాపం తెలిపింది. కాన్సస్ కాల్పులు బాధితుల కోసం అమెరికా చట్టసభ సభ్యులు నిమిషం మౌనం పాటించారు. గత బుధవారం రాత్రి కాన్సస్ లోని ఆస్టిన్స్ బార్‌లో ఆడమ్ పూరింటన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో కూచిభొట్ల శ్రీనివాస్ మృతి చెందాడు. మరో తెలుగు ఇంజనీర్ అలోక్ రెడ్డి, అమెరికన్ ఇయాన్ గ్రిల్లాట్ గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు ఎఫ్ బీఐ తెలిపింది. జాత్యంహకార దాడిగానే భావించి విచారణ చేపట్టామని ఎఫ్ బీఐ వెల్లడించింది.