కూచిభొట్ల భార్యకు తాత్కాలిక వర్క్ వీసా
వాషింగ్టన్: అమెరికాలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన దుమలా అమెరికా నివాస హక్కులపై సందిగ్ధతలు తొలగిపోయాయి. కాంగ్రెస్ సభ్యుడు కెవిన్ యోడర్ సహాయంతో ఇటీవల ఆమె అమెరికా తాత్కాలిక వర్క్ వీసా పొందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాన్సాస్ బార్‌లో శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. భర్త శ్రీనివాస్ మరణించడంతో అమెరికాలో నివసించే హక్కును సునయన కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో తాత్కాలిక వీసా పొందేందుకు యోడర్ సహాయం చేశారు. ‘సునయన బాధపడింది చాలు. ఆమెకు సహాయపడాలని భావించాము. ఇకపై శాశ్వత వీసా వచ్చేలా ప్రయత్నిస్తాం’ అని యోడర్ ఫేస్‌బుక్‌లో తెలిపారు.