నిన్ను చాలా మిస్సవుతున్నా: సునయన | Missing you a lot Kuchibhotla wife sends him FB wish on his birthday | Sakshi
Sakshi News home page

నిన్ను చాలా మిస్సవుతున్నా: సునయన

Published Thu, Mar 9 2017 1:19 PM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

నిన్ను చాలా మిస్సవుతున్నా: సునయన

నిన్ను చాలా మిస్సవుతున్నా: సునయన

హైదరాబాద్‌: ప్రవాస భారతీయుడు, ఏవియేషన్ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల ఈ లోకంలో ఉన్నట్టయితే ఈ రోజు (గురువారం) తన 33వ పుట్టినరోజు వేడుకను చేసుకునేవారు. ఇప్పుడు శ్రీనివాస్ లేరు. అతని జ్ఞాపకాలే మిగిలున్నాయి. అమెరికాలోని కాన్సాస్‌లో ఓ శ్వేతిజాతి దుండగుడు జాతివివక్షతో జరిపిన కాల్పుల్లో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, భార్య సునయన ఇంకా ఈ విషాదం నుంచి కోలుకోలేదు. సునయన కన్నీటి జ్ఞాపకాలతో భర్తను గుర్తు చేసుకుంటూ విషెష్ చెప్పారు. శ్రీనివాస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ లేఖను పోస్ట్ చేశారు.

'హ్యాపీ బర్త్ డే మై లవ్. ఇలా శుభాకాంక్షలు చెబుతున్నందుకు బాధగా ఉంది. నిన్ను చాలా మిస్సవుతున్నా' అంటూ సునయన పోస్ట్ చేశారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇంకా విషాదం నుంచి కోలుకోలేదని సమీప బంధువు కృష్ణమోహన్ చెప్పారు. శ్రీనివాస్ బతికున్న రోజుల్లో ప్రతీ పుట్టినరోజున స్కైప్ ద్వారా వీడియో కాల్ చేసి కుటుంబ సభ్యులందరితో మాట్లాడేవారని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునేవారని తెలిపారు. శ్రీనివాస్ జయంతి సందర్భంగా ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement