కాల్పులను ఖండించిన అమెరికా | US Embassy condemns killing of Telugu man in Kansas | Sakshi
Sakshi News home page

కాల్పులను ఖండించిన అమెరికా

Published Fri, Feb 24 2017 1:26 PM | Last Updated on Fri, Aug 24 2018 6:33 PM

కాల్పులను ఖండించిన అమెరికా - Sakshi

కాల్పులను ఖండించిన అమెరికా

న్యూఢిల్లీ: కన్సాస్‌ జాతి విద్వేష కాల్పులను భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం ఖండించింది. ఈ ఘటనపై తమ దేశ దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని అమెరికా ఎంబసీ అధికారి మ్యారీకే ఎల్‌ కార్లసన్ వెల్లడించారు. కేసుపై వేగంగా దర్యాప్తు జరుపుతుందని అన్నారు. ఈ ఘటనలో తెలుగు వ్యక్తి శ్రీనివాస్‌ కూచిభొట్ల ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

మరోవైపు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించింది. గాయపడిన మేడసాని అలోక్ ఇంటికి భారత కాన్సులేట్‌ జనరల్‌ ఆర్డీ జోషి వెళ్లి అతడిని పరామర్శించారు. అలోక్ క్షేమంగా ఉన్నాడని, అతడికి అవసరమైన సహాయం అందిస్తామని హూస్టన్ లోని భారత రాయబార కార్యాలయ అధికారి అనుమప్‌ రే హామీయిచ్చారు. శ్రీనివాస్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement