Telugu man
-
తైవాన్ అమ్మాయి.. తెలుగింటి అబ్బాయి
సాక్షి, చల్లపల్లి(అవనిగడ్డ): ఎల్లలు ఎరుగని ప్రేమతో ఎంతో మంది విదేశీ వనితలు తెలుగింటి అబ్బాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా చల్లపల్లి గ్రామానికి చెందిన వేమూరి సాయిదినకర్, తైవాన్ దేశానికి చెందిన యూటింగ్ లియూ పెద్దల అనుమతితో ప్రేమ వివాహం చేసుకున్నారు. చల్లపల్లికి చెందిన మెడికల్ షాప్ నిర్వాహకుడు వేమూరి కిషోర్ కుమారుడు సాయి దినకర్ తైవాన్ దేశంలోని సించూ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అక్కడే ఫిజియోథెరపిస్ట్ యూటింగ్ లియూతో ప్రేమలో పడ్డారు. వారిద్దరి వివాహానికి వరుడి తండ్రి కిషోర్, వధువు తండ్రి ఈషెంగ్ లియూ అంగీకరించారు. దీంతో ఈ నెల రెండో తేదీ ద్వారకా తిరుమలలో సాయి దినకర్, యూటింగ్ లియూ వివాహం తెలుగు సంప్రదాయంలో వైభవంగా నిర్వహించారు. సోమవారం ఘంటసాల మండలం దేవరకోటలో రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు వధువు యూటింగ్ లియూ కుటుంబ సభ్యులు, బంధువులైన తైవాన్ దేశస్థులందరూ తెలుగు సంప్రదాయం ప్రకారం మహిళలు పట్టు చీరలు, పురుషులు పట్టు పంచెలు ధరించి ఆకట్టుకున్నారు. చదవండి: కోనసీమ: పిడుగు పాటుతో కుంగిన భూమి -
అమెరికా గోల్ఫ్‌లో తెలుగు కెరటం
నపా (అమెరికా): అమెరికాకు చెందిన తెలుగు గోల్ఫర్ తీగల సాహిత్ రెడ్డి ఫార్టీనెట్ వరల్డ్ ర్యాంకింగ్ గోల్ఫ్ టోర్నమెంట్లో మెరిశాడు. 73 మంది పాల్గొన్న ఈ టోర్నీలో అతను 11 పాయింట్ల స్కోరుతో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. టాప్–10లో నిలిచిన సాహిత్‌కు 2 లక్షల 70 వేల డాలర్లు (రూ.2 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. రికీ ఫాలెర్, నిక్ టేలర్లు కూడా 11 స్కోరు చేయడంతో ముగ్గురు ఆరో స్థానాన్ని పంచుకున్నారు. 24 ఏళ్ల ఈ తెలుగు గోల్ఫర్ తాజా ప్రదర్శనతో ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ (పీజీఏ) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడు స్థానాలు ఎగబాకి 51వ స్థానానికి చేరుకున్నాడు. ఎవరీ తీగల సాహిత్? సాహిత్ రెడ్డి జన్మతః అమెరికన్ అయినప్పటికీ భారతీయుడు. హైదరాబాద్‌కు చెందిన తీగల మురళీధర్ రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం కోసం 1987లో అమెరికాకు వెళ్లారు. ఉన్నత విద్య పూర్తయ్యాక తెలుగమ్మాయి కరుణను వివాహమాడి కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. వీరికి సాహిత్‌తో పాటు మరో కుమారుడు సహన్ రెడ్డి ఉన్నాడు. ఇప్పటికీ అతని కుటుంబం ప్రతీ రెండేళ్లకోసారి హైదరాబాద్‌కు వచ్చి వెళుతుంది. 2001లో సాహిత్ తల్లి థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడటంతో ఇద్దరి పిల్లల బాగోగులు అమ్మమ్మ విజయలక్ష్మి చూసుకునేది. చిన్నప్పటి నుంచి సాహిత్‌కు గోల్ఫ్ అంటే సరదా. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఆటను ఆపలేదు. దీని ఫలితం ఇప్పుడు ప్రొఫెషనల్ అయ్యేందుకు దోహదపడింది. 2020లో ప్రొఫెషనల్ గోల్ఫర్గా మారిన సాహిత్ ఈ రెండున్నరేళ్లతోనే సంచలన ప్రదర్శనతో అది కూడా అసాధారణ పోటీ ఉండే అమెరికాలో ఈ స్థాయికి దూసుకురావడం గొప్ప ఘనత. 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు, 90 కేజీల బరువున్న సాహిత్ 2021–22 సీజన్లో జోరు పెంచాడు. మొత్తం నాలుగు టోర్నీల్లో టాప్–10లో నిలిచాడు. దీంతో ఈ సీజన్లోనే సాహిత్ 17 లక్షల డాలర్లు (రూ.13 కోట్ల 54 లక్షలు) ప్రైజ్‌మనీ రూపేణా సంపాదించడం గమనార్హం. ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ టోర్నీల్లో భారత ఆటగాళ్లు చాలా మందే ఆడుతున్నారు కానీ ఓ హైదరాబాదీ ఈ స్థాయిలో రాణిస్తుండటం విశేషం. -
తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి
Sai Pallavi Says Her Father Jokes About Marrying Telugu Guy: బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి తాజాగా నటించిన చిత్రం విరాట పర్వం. రానా సరసన సాయి పల్లవి వెన్నెలగా నటించిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది సాయి పల్లవి. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తెలుగు అబ్బాయితో పెళ్లి, సినిమాల తర్వాత కెరీర్ వంటి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తన పెళ్లి గురించి మాట్లాడుతూ 'నేను ఇంట్లో ఇప్పుడు ఎక్కువగా తెలుగు మాట్లాడుతున్నాను. ఇది చూసిన మా నాన్న నిన్ను చూస్తుంటే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావ్ అని అన్నారు. నిజానికి మేము ఇంట్లో ఎక్కువగా బడగా భాష మాట్లాడతాం. నాకు అనుకోకుండా మధ్యలో తెలుగు వచ్చేస్తుంది. ఇక నా పెళ్లి ఇప్పుడే జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ప్రస్తుతం సింగిల్‌గా చాలా సంతోషంగా ఉన్నాను. నా గురించి మరింత తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు అదే చేస్తున్నాను.' అని సాయి పల్లవి తెలిపింది. చదవండి: ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్ అలాగే సినిమాలకు స్వస్తి పలకాల్సి వస్తే ఏ కెరీర్‌ను ఎంచుకుంటారు అని అడిగిన ప్రశ్నకు.. 'ఎంబీబీఎస్‌లో డిగ్రీ చేశాను. ప్రస్తుతం మెడిసిన్ కొనసాగించడం లేదు. నాకు మొదట్లో కార్డియాలజీపై ఆసక్తి ఉండేది. ఇప్పుడు గైనకాలజీపై ఉంది. ఎందుకంటే చాలా మంది యువతులు ఇప్పటికీ తమ సమస్యల గురించి గైనకాలజిస్ట్‌తో ఓపెన్‌గా చెప్పలేకపోవడం నేను చూస్తున్నాను. ఒక డాక్టర్ మాత్రమే అలాంటి స్త్రీలను మరింత సౌకర్యవంతంగా సమస్య చెప్పుకునేలా చేయగలరని నేను భావిస్తున్నాను. అందుకు నేను ఏదో ఒకటి చేయగలను అని అనుకుంటున్నాను.' అని పేర్కొంది. చదవండి: ఆ విషయంలో వెన్నెల.. నేనూ ఒకటే! -
మానస సరోవర్ యాత్రలో విషాదం
-
అమర్నాథ్ యాత్రలో అపశృతి
శ్రీనగర్(జమ్మూకశ్మీర్): అమర్నాథ్ యాత్రలో మంగళవానం అపశృతి చోటుచేసుకుంది. అమర్నాథ్ యాత్రకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోట రత్నం(72) గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన బలకేజ్ బేస్ క్యాంప్‌లో జరిగినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితమే రత్నం రాజమండ్రి వారితో కలిసి యాత్రకు వెళ్లినట్లు సమాచారం. రత్నం మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులకి అధికారులు సమాచారం అందించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని చాగల్లుకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మానస సరోవర్ యాత్రలో విషాదం: మానస సరోవర్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావు యాత్రలో మృతిచెందారు. మానస సరోవరం నుంచి తిరుగి వస్తుండగా మార్గమద్యమంలోని టిబెట్ ప్రాంతంలో మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాన్ని హిల్సా నుంచి సిమిల్ కోట్కు తరలించారు. అక్కడి నుంచి అధికారులు మృతదేహాన్ని నేపాల్ గంజ్‌కు తరలిస్తున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని లక్నో మీదుగా స్వస్థలానికి తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్ రాయబార కార్యాలయంతో ఏపీ భవన్ కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. -
అమెరికాలోని తెలుగు యువకుడి ఆచూకీ లభ్యం
సైదాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్న తెలుగు యువకుడి ఆచూకీ లభ్యమైంది. అతడి ఆచూకీ తెలియడం లేదంటూ తల్లిదండ్రులు శుక్రవారం మీడియా ఎదుట వాపోయారు. శనివారం పత్రికలలో ప్రచురితమైన కథనాలు నెట్లో చూసిన ఆ యువకుడు తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాడు. చంపాపేట సమీపంలోని వినయ్‌నగర్ కాలనీలో ఉంటున్న పండు బంగారం కుమారుడు పి.రాఘవేందర్రావు ఆమెరికాలో ఉంటున్నాడు. కుమారుడి కనిపించడం లేదని రాఘవేందర్రావు తల్లిదండ్రులు బంగారం, పుష్పలత మీడియా ముందుకొచ్చారు. విషయం తెలుసుకున్న రాఘవేందర్రావు శనివారం ఉదయం తల్లిదండ్రులతో వాట్సప్ వీడియో కాల్ మాట్లాడాడు. 8నెలల తర్వాత కుమారుడు ఫోన్ చేయడంతో వారికి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాఘవేందర్రావు తన ఆవేదనను తల్లిదండ్రులకు చెప్పుకున్నాడు. తన ఆఫీస్‌లోనే పనిచేస్తున్న హియాయత్‌నగర్‌కు చెందిన ఒక యువతిని ప్రేమించానని, ఇద్దరం కలిసి సహజీవనం చేశామని వివరించాడు. ఇద్దరు పిల్లలు కూడ పుట్టారని, మనస్పర్థలు రావడంతో ఆ అమ్మాయి తనపై కేసు పెట్టిందని, దీంతో కాలిఫోర్నియా పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారని వాపోయాడు. రెండు నెలలు జైలులో ఉండి, బెయిల్‌పై బయటకు వచ్చానని పేర్కొన్నాడు. దీంతో తనను ఉద్యోగం నుంచి తొలగించారన్నాడు. తన వీసా కూడా ఆమె దగ్గరే ఉందని, దీంతో ఇండియాకు రాలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుమారుడిని ఇండియాకు రప్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
అమెరికాలో తెలుగు యువకుడు మృతి
అమెరికాలోని బ్లూమింగ్ టౌన్లో తెలుగు యువకుడు మృతిచెందాడు. మాన్రో సరస్సులో పడి తెలుగు విద్యార్థి అనూప్ తోట (26) ప్రాణాలు కోల్పోయాడు. అనూప్ శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి బోటింగ్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో అతను అకస్మాత్తుగా గల్లంతయ్యాడు. దీంతో తన స్నేహితులు 911కి ఫోన్ చేసి రెస్క్యూ సిబ్బంది సమాచారం అందించారు. సిబ్బంది రెండు రోజులపాటు అనూప్ కోసం గాలింపులు చేశారు. ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు అతడి మృతదేహాన్ని వెలికి తీశారు. రెస్కూ సిబ్బంది సోనార్ స్కానర్ ద్వారా మృతదేహాన్ని 15 అడుగుల లోతులో గుర్తించారు. -
సిద్దిపేట చిన్నోడు..కొలంబియా కుమారి
సిద్దిపేటజోన్ : చదువు కోసం కొలాంబియా వెళ్లిన సిద్దిపేట యవకుడు భరత్‌కు అక్కడి అమ్మాయి మేరీతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో కులాలు, సంప్రదాయాలు పక్కన పెట్టి ఎల్లలు దాటి వారు ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. భారతదేశ సాంస్కృతిని చాటి చెప్పేలా వీరి కులాంతర, మతాంతర వివాహం జరిగిందని ఎంఎల్సీ ఫారుక్ హుస్సేన్ అన్నారు. వివాహంలో వరుడి తల్లిదండ్రులు రమాదేవి, రాధాకృష్ణ, వధువు తల్లిదండ్రులు రాబర్ట్, గ్యాబ్రియేలు, బంధు మిత్రులు పాల్గొన్నారు. -
కాల్పులను ఖండించిన అమెరికా
న్యూఢిల్లీ: కన్సాస్ జాతి విద్వేష కాల్పులను భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం ఖండించింది. ఈ ఘటనపై తమ దేశ దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని అమెరికా ఎంబసీ అధికారి మ్యారీకే ఎల్ కార్లసన్ వెల్లడించారు. కేసుపై వేగంగా దర్యాప్తు జరుపుతుందని అన్నారు. ఈ ఘటనలో తెలుగు వ్యక్తి శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించింది. గాయపడిన మేడసాని అలోక్ ఇంటికి భారత కాన్సులేట్ జనరల్ ఆర్డీ జోషి వెళ్లి అతడిని పరామర్శించారు. అలోక్ క్షేమంగా ఉన్నాడని, అతడికి అవసరమైన సహాయం అందిస్తామని హూస్టన్ లోని భారత రాయబార కార్యాలయ అధికారి అనుమప్ రే హామీయిచ్చారు. శ్రీనివాస్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. -
అమెరికాలో తెలుగు యువకుడి హత్య
-
అమెరికాలో తెలుగు యువకుడి హత్య
హైదరాబాద్: తెలుగు యువకుడొకరు అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ లోని కుషాయిగూడ ప్రాంతానికి చెందిన సాయికిరణ్(21) అనే యువకుడిని దుండగులు కాల్చి చంపారు. ఫ్లోరిడాలోని మియామి ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఐఫోన్ కోసం నల్లజాతీయులు అతడిని హత్య చేసినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. 45 రోజుల క్రితమే ఉన్నత చదువుల కోసం సాయికిరణ్ అమెరికా వెళ్లాడు. కుమారుడి మరణ వార్తతో సాయికిరణ్ తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. -
తెలుగు యువకుడి ఆత్మహత్య
పుణే సిటీ, న్యూస్‌లైన్: ఘోర్పడి శ్రీనాథ్‌నగర్‌లో నివాసముంటున్న ఓ తెలుగు యువకుడు గురువారం కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం అతని మృతదేహాన్ని వెలికితేశారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. హడప్సర్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా, చంద్రశేఖరపురం మండలం, పులగోరు పల్లె నుంచి బతుకు దెరువు నిమిత్తం మేక తిరుపాల్, భాగ్యమ్మ దంపతులు నగరానికి వచ్చారు. వీరి పెద్ద కుమారుడు మేక ప్రవీణ్ (22)తోపాటు గత 20 ఏళ్లుగా శ్రీనాథ్‌నగర్‌లోని 5వ నంబరుకాలనీలో ఉంటున్నారు. అయితే పట్టభద్రుడైన ప్రవీణ్ గత కొన్ని రోజులుగా ఏదో విషయమై తీవ్ర వేదనకు గురవుతున్నాడని స్నేహితులు పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు కొన్నినిమిషాల ముందు తన స్నేహితులకు ‘ఈ రోజు నా జీవితానికి ఆఖరి రోజు’ అనే మె సేజ్ కూడా పంపాడని తెలిసింది. తర్వాత ఈ సమాచారం తల్లిదండ్రులకు చేరడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. చివరికి ప్రీతి ప్రకాష్ సొసైటీ కార్యాలయం వెనుక ఉన్న పెద్ద కాలువ కట్టపై అతని మొబైల్, చెప్పులు ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అం దించారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టడంతో శుక్రవారం మధ్యాహ్నం అతని మృత దేహాన్ని వెలికితీశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బంధువులు రావడంతో ఆదివారం అంత్యక్రియలు పూర్తి చేశారు.