
అనూప్ తోట(ఫైల్ ఫోటో)
అమెరికాలోని బ్లూమింగ్ టౌన్‌లో తెలుగు యువకుడు మృతిచెందాడు. మాన్రో సరస్సులో పడి తెలుగు విద్యార్థి అనూప్ తోట (26) ప్రాణాలు కోల్పోయాడు. అనూప్ శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి బోటింగ్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో అతను అకస్మాత్తుగా గల్లంతయ్యాడు. దీంతో తన స్నేహితులు 911కి ఫోన్ చేసి రెస్క్యూ సిబ్బంది సమాచారం అందించారు. సిబ్బంది రెండు రోజులపాటు అనూప్ కోసం గాలింపులు చేశారు. ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు అతడి మృతదేహాన్ని వెలికి తీశారు. రెస్కూ సిబ్బంది సోనార్ స్కానర్ ద్వారా మృతదేహాన్ని 15 అడుగుల లోతులో గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment