
అమెరికాలో తెలుగు యువకుడి హత్య
హైదరాబాద్: తెలుగు యువకుడొకరు అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ లోని కుషాయిగూడ ప్రాంతానికి చెందిన సాయికిరణ్(21) అనే యువకుడిని దుండగులు కాల్చి చంపారు. ఫ్లోరిడాలోని మియామి ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఐఫోన్ కోసం నల్లజాతీయులు అతడిని హత్య చేసినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. 45 రోజుల క్రితమే ఉన్నత చదువుల కోసం సాయికిరణ్ అమెరికా వెళ్లాడు. కుమారుడి మరణ వార్తతో సాయికిరణ్ తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.