వివాహం చేసుకుంటున్న భరత్, మేరీ
సిద్దిపేటజోన్ : చదువు కోసం కొలాంబియా వెళ్లిన సిద్దిపేట యవకుడు భరత్‌కు అక్కడి అమ్మాయి మేరీతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో కులాలు, సంప్రదాయాలు పక్కన పెట్టి ఎల్లలు దాటి వారు ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు.
భారతదేశ సాంస్కృతిని చాటి చెప్పేలా వీరి కులాంతర, మతాంతర వివాహం జరిగిందని ఎంఎల్‌సీ ఫారుక్ హుస్సేన్ అన్నారు. వివాహంలో వరుడి తల్లిదండ్రులు రమాదేవి, రాధాకృష్ణ, వధువు తల్లిదండ్రులు రాబర్ట్, గ్యాబ్రియేలు, బంధు మిత్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment