తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి | Sai Pallavi Says Her Father Jokes About Marrying Telugu Guy | Sakshi
Sakshi News home page

Sai Pallavi: సినిమాలు చేయకుంటే ఆ కెరీర్‌ ఎంచుకుంటా: సాయి పల్లవి

Published Wed, Jun 15 2022 5:18 PM | Last Updated on Wed, Jun 15 2022 5:26 PM

Sai Pallavi Says Her Father Jokes About Marrying Telugu Guy - Sakshi

Sai Pallavi Says Her Father Jokes About Marrying Telugu Guy: బ్యూటిఫుల్‌ అండ్‌ టాలెంటెడ్‌ హీరోయిన్‌ సాయి పల్లవి తాజాగా నటించిన చిత్రం విరాట పర్వం. రానా సరసన సాయి పల్లవి వెన్నెలగా నటించిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల అనంతరం ఎ‍ట్టకేలకు జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది సాయి పల్లవి. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తెలుగు అబ్బాయితో పెళ్లి, సినిమాల తర్వాత కెరీర్‌ వంటి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 

తన పెళ్లి గురించి మాట్లాడుతూ  'నేను ఇంట్లో ఇప్పుడు ఎక్కువగా తెలుగు మాట్లాడుతున్నాను. ఇది చూసిన మా నాన్న నిన్ను చూస్తుంటే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావ్‌ అని అన్నారు. నిజానికి మేము ఇంట్లో ఎక్కువగా బడగా భాష మాట్లాడతాం. నాకు అనుకోకుండా మధ్యలో తెలుగు వచ్చేస్తుంది. ఇక నా పెళ్లి ఇప్పుడే జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ప్రస్తుతం సింగిల్‌గా చాలా సంతోషంగా ఉన్నాను. నా గురించి మరింత తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు అదే చేస్తున్నాను.' అని సాయి పల్లవి తెలిపింది. 

చదవండి: ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్‌ హాసన్‌

అలాగే సినిమాలకు స్వస్తి పలకాల్సి వస్తే ఏ కెరీర్‌ను ఎంచుకుంటారు అని అడిగిన ప్రశ్నకు.. 'ఎంబీబీఎస్‌లో డిగ్రీ చేశాను. ప్రస్తుతం మెడిసిన్‌ కొనసాగించడం లేదు. నాకు మొదట్లో కార్డియాలజీపై ఆసక్తి ఉండేది. ఇప్పుడు గైనకాలజీపై ఉంది. ఎందుకంటే చాలా మంది యువతులు ఇప్పటికీ తమ సమస్యల గురించి గైనకాలజిస్ట్‌తో ఓపెన్‌గా చెప్పలేకపోవడం నేను చూస్తున్నాను. ఒక డాక్టర్‌ మాత్రమే అలాంటి స్త్రీలను మరింత సౌకర్యవంతంగా సమస్య చెప్పుకునేలా చేయగలరని నేను భావిస్తున్నాను. అందుకు నేను ఏదో ఒకటి చేయగలను అని అనుకుంటున్నాను.' అని పేర్కొంది. 

చదవండి: ఆ విషయంలో వెన్నెల.. నేనూ ఒకటే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement