
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: తన కుమార్తె వయసున్న బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటనలో కామాంధుడు ఎడ్ల రమేశ్ (45) బతికున్నంత కాలం జైలు జీవితం గడపాలని చిన్నారులపై లైంగిక దాడుల నియంత్రణ (పోక్సో) కేసుల విచారణ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. అలాగే రూ.20 వేలు జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి బి.సురేశ్ తీర్పులో పేర్కొన్నారు.
మూడేళ్ల క్రితం లైంగిక దాడి జరిగిన సమయంలో బాలిక వయస్సు 11 సంవత్సరాల 6 నెలలని, ఈ నేపథ్యంలో బాధితుల పరిహార పథకం కింద రూ.7 లక్షలు పరిహారం ప్రభుత్వం చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవా సాధికార సంస్థను ఆదేశించింది. ఇందులో 80 శాతం మొత్తాన్ని జాతీయ బ్యాంకులో బాలిక పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని, ఈ డబ్బును బాలిక మేజర్ అయిన తర్వాత తీసుకోవచ్చని పేర్కొంది. మిగిలిన 20 శాతం డబ్బును బాలికకు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment