తండ్రిని చంపిన తనయుడికి న్యాయస్థానం గురువారం జీవితఖైదు విధించింది
చిత్తూరు జిల్లా: తండ్రిని చంపిన తనయుడికి న్యాయస్థానం గురువారం జీవితఖైదు విధించింది. వివరాలు.. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన రమేష్ 2013లో తండ్రిని ఆస్తి పంచాలని కోరాడు. అందుకు తండ్రి శ్రీరాములు(65) నిరాకరించడంతో అగ్రహించిన రమేష్ తండ్రిపై దాడిచేసి తలనరికి చంపాడు. అనంతరం కుప్పం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ కేసును విచారించిన చిత్తూరు జిల్లా జడ్జీ విజయ్‌కుమార్ అతనికి జీవితఖైదు విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు.
(కుప్పం)