బనశంకరి: బాలికపై అత్యాచారం, హత్య కేసులో యువకుడికి నగర ఎఫ్‌టీసీ 1వ కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. సోమసంద్రపాళ్య నివాసి సీ.రాజు (25) అనే యువకుడు ఓ బాలిక (15)ను పరిచయం చేసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో రాజుకు యావజ్జీవ శిక్షతో పాటు లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కేఎన్.రూపా తీర్పు ఇచ్చారు. డెవలిరీ బాయ్‌గా ఉన్న రాజు వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌లో బాలిక పరిచయమైంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో బాలిక ఇంట్లో ఎవరూలేని సమయంలో వెళ్లి రహస్యంగా కలుసుకునేవాడు.
ఇలా పలుమార్లు స్కూల్ అయిపోగానే బాలికను రాజు ఇంటికి తీసుకెళ్లి శారీరకంగా కలుసుకునేవాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో ఇద్దరిని హెచ్చరించారు. అప్పటి నుంచి రాజుతో బాలిక దూరంగా ఉంటోంది. బాలికపై కోపం పెంచుకున్న రాజు 2021 ఏప్రిల్ 3న బాలికను వెంబడించి తన ఇంటికి రాకపోతే అంతుచూస్తానని బెదిరించాడు. చివరికి బాలిక రాజు ఇంటికి వచ్చింది.
వెంటనే అల్యూమినియం వైర్‌తో గొంతు బిగించి ఊపిరాడకుండా నోటిలో బట్టలు కుక్కి హత్య చేశాడు. అనంతరం తానూ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని చూశాడు. మళ్లీ అక్కడే కూర్చొని ఈ విషయాన్ని స్నేహితులకు తెలిపాడు. అనంతరం రైలు పట్టాలపై ఆత్మహత్యకు యత్నించాడు. గాయపడిన రాజును ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బండేపాళ్య పోలీసులు హత్య కేసు నమోదు చేసి రాజును అరెస్ట్ చేసి ఎఫ్‌టీసీలో చార్జిషీట్ వేశారు. వాదప్రతివాదనలు ఆలకించిన కోర్టు న్యాయమూర్తి కేఎన్.రూపా గురువారం రాజుకు యావజ్జీవ శిక్షతో పాటు లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment