సాక్షి, ముంబై: దాదాపు 20 ఏళ్ల నాటి కేసులో ముంబై స్పెషల్ కోర్టుసంచలన తీర్పును వెలువరించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మాజీ అధికారితోపాటు మరో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. అంతేకాదు ఈ కేసులో న్యాయవాదికి మూడేళ్ల జైలు శిక్షను విధించిందని గురువారం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటన తెలిపింది. 2000 బీఓఐలో చోటు చేసుకున్న 2.91కోట్ల కుంభకోణానికి సంబంధించి కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
సీబీఐ అందించిన సమాచారం ప్రకారం, 2000లో స్విఫ్ట్ సేవల కింద బ్రాంచ్ అధికారులతో కుమ్మక్కై, నకిలీ పత్రాలతో ఆహుజా అతని భాగస్వాములు కలిసి 2.50 కోట్ల రూపాయల మేర లోన్ తీసుకున్నారు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో 2004 ప్రారంభంలో ఎన్‌పీఏగా ప్రకటించబడింది. దీంతో బ్యాంకు నష్టం మొత్తం రూ. 2.91 కోట్లకు చేరింది. 2004లో కేసు నమోదు చేసిన సీబీఐ విచారణ అనంతరం నవంబరు 2005లో చార్జిషీట్ దాఖలు చేసింది. బ్యాంకుకు చెందిన అప్పటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ భగవాన్జీ డి.జోషి, బ్యాంకులో రుణం తీసుకున్న 5గురు వ్యాపారవేత్తలు - మనోహర్‌లాల్ ఆహుజా, అతని కుమారుడు అమిత్ ఆహుజా, మహేష్ బోరా, సందేష్ రామచంద్ర నాగే, జి.కె.శర్మ, శాంతిలాల్ చౌహాన్ తోపాటు న్యాయవాది యూనస్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసింది. దీనిపై ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టులో విచారణ అనంతరం ఈ తీర్పునిచ్చింది. ఈ తీర్పు చాలా అరుదైనది. ఒక మైలురాయిలాంటిదని అధికారులు భావిస్తున్నారు.
అంతేకాదు ఆహుజా తండ్రీకొడుకులిద్దరికి చెరి రూ. 50 లక్షలు, బొహ్రా రూ. 3లక్షలు, నాగే రూ. 60వేల, చౌహాన్ రూ .50వేలు జోషి రూ. లక్ష, న్యాయవాదికి రూ .3 వేల జరిమానా విధించడం గమనార్హం. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన శర్మ ఆగస్టు ,2008 లో చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment