హర్యానా: అత్యాచారం, హత్యకేసులో ఏడుగురికి రోహ్‌టక్ కోర్టు సోమవారం ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో దోషులకు 1.75 లక్షల రూపాయల చొప్పున కోర్టు జరిమానా విధించింది. అయితే గత ఫిబ్రవరి 4న 28 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై ఎనిమిది మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన కోర్టు.. దోషులుగా తేలడంతో వారికి మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కాగా, ఎనిమిది మంది దోషుల్లో ఒకరు అరెస్ట్ అనంతరం తప్పించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు.