భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు | Court confirms life sentence of man convicted for wife's murder | Sakshi
Sakshi News home page

భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు

Published Mon, Jan 11 2016 6:37 PM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM

Court confirms life sentence of man convicted for wife's murder

మార్కాపురం (ప్రకాశం) : మద్యం మత్తులో భార్యను గొంతు నులిమి హత్య చేసిన భర్తకు యావజ్జీవ ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం ముమ్మడివరం గ్రామానికి చెందిన ఇజ్రాయిల్, సువార్త(24) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు.

ఈ క్రమంలో మద్యానికి బానిసైన ఇజ్రాయిల్ 2011 నవంబర్ 16న పూటుగా తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడి విపరీతంగా కొట్టాడు. అతని నుంచి విడిపించుకోవడానికి ఆమె ప్రయత్నించడంతో..  గొంతు నులిమి చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా పూర్తి విచారణ అనంతరం నేరం నిరూపించబడటంతో సోమవారం జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement