లండన్: ఫన్ కోసం సరదాగా ఆడే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఓ యువకుడిని జైలు పాలు చేసింది. గేమ్‌లో భాగంగా సదరు యువకుడు తన నానమ్మను చంపేశాడు. ఈ సంఘటన రెండేళ్ల క్రితం జరగ్గా.. తాజగా కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది. ఆ వివరాలు..
లాంక్షైర్ కాన్‌స్టాబులరీ ప్రకారం, యూకేకి చెందిన టియర్నాన్ డార్న్టన్ అనే యువకుడికి రిస్కీ పనులు చేయడం అంటే చాలా ఇష్టం. థ్రిల్ కోసం ప్రాణాలు పణంగా పెట్టడానికే కాదు.. తీయడానికి కూడా రెడీనే. ఈ క్రమంలో 2018, మే 28న ఇలాంటి థ్రిల్లింగ్ పనికే పూనుకున్నాడు. స్నేహితులతో కలిసి ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాడు.
(చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!!)
ఈ క్రమంలో తన వంతు వచ్చినప్పుడు డేర్ సెలక్ట్ చేసుకున్నాడు డార్న్టన్. దానిలో భాగంగా తన నానమ్మ మేరీ గ్రెగోర్ ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ సంఘటనలో మేరీ మరణించింది. న్యూమోనియా, ఊపిరిడకపోవడం వల్ల చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు, లాంక్షైర్ కాన్‌స్టాబులరీ ఉమ్మడి పరిశోధనలో సిగరెట్‌ని ఆర్పకుండా పడేయడం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. ప్రమాదవశాత్తు మరణించినట్లు నివేదికలో పేర్కొన్నారు.
మరి ఇప్పుడెలా బయటపడింది అంటే డార్న్టనే స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల క్రితం డార్న్టన్ ఓ కౌన్సిలర్‌ని కలిశాడు. మాటలో మధ్యలో గతంలో తాను తన నానమ్మ ఇంటికే నిప్పు పెట్టానని.. ఈ ప్రమాదంలో ఆమె మరణించిందని తెలిపాడు. ఈ విషయాన్ని కౌన్సిలర్ పోలీసులుకు తెలపడంతో వారు కేసును రీఒపెన్ చేశారు.
(చదవండి: ఇదేం ట్రెండ్‌రా నాయనా... డస్ట్‌బిన్ కవరే డ్రెస్సు.!)
కేసు విచారణలో డార్న్టన్ సంచలన విషయాలు తెలిపాడు. ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌లో భాగంగా తానే తన నానమ్మ ఇంటికి నిప్పు పెట్టినట్లు వెల్లడించాడు. దీని తర్వాత మరో సారి కూడా ఇలాంటి పని చేసినట్లు తెలిపాడు. ఈ క్రమంలో 2021, మార్చిలో డార్న్టన్ మీద హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. కోర్టు డార్న్టన్‌కు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో పెరోల్ లభించాలంటే.. డార్న్టన్ కనీసం 15 సంవత్సరాలు జైలు జీవితం గడపాలి. ఆ తర్వాతే అతడికి పెరోల్ లభించనుంది.
చదవండి: 17 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. గ్రాండ్‌గా విడాకుల పార్టీ
Comments
Please login to add a commentAdd a comment