తాను పని చేస్తున్న ఇంట్లో యజమాని కూతురిని చంపినందుకు దుబాయ్లో ఓ భారతీయ మహిళకు జీవితఖైదు విధించారు. సెలవు ఇవ్వలేదన్న కోపంతో 11 నెలల బాలికను చంపినందుకు ఈ శిక్ష పడింది. ఆర్.టి. అనే ఇంటిపేరున్న నిందితురాలు.. తన యజమాని ఇంట్లో లేని సమయంలో ఆ చిన్నారి బాలిక మెడకు స్కార్ఫ్ బిగించి, పీకనొక్కి చంపేసింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఆమె ఈ హత్య చేసినట్లు కోర్టులో రుజువైంది.
తొలుత ఆమె తాను ఆ పాపను హత్య చేయలేదని, కేవలం మంచం మీద పడుకోబెట్టానని కోర్టులో చెప్పింది. ఆమెను తన సొంత కూతురిలా ప్రేమించానంది. తనకూ ఇద్దరు పిల్లలున్నారని, అందువల్ల ఇలాంటి దారుణానికి పాల్పడే అవకాశమే లేదని తెరలిపింది. అయితే, ఆమె తన యజమాని బయటకు వెళ్లే వరకు ఆగడం.. స్కార్ఫ్ కొనుక్కుని తీసుకొచ్చి పాప మెడచుట్టూ చుట్టి, ఆమె నోట్లోంచి ఎలాంటి అరుపులు రాకుండా నోరు నొక్కడం అన్నీ రుజువయ్యాయి. తర్వాత ఏమీ ఎరగనట్లు ఇంట్లో పని చేసుకుంటూ ఉండిపోయింది. తర్వాత బాలిక తల్లికి అనుమానం రావడంతో తన సోదరికి ఫోన్ చేసి.. ఇంటికి వెళ్లాల్సిందిగా చెప్పింది. తీరా ఆమె వచ్చి చూస్తే పాప కదలట్లేదు. వెంటనే ఆస్పత్రికి తరలించినా, రెండు గంటల క్రితమే మరణించినట్లు చెప్పారు.
దుబాయ్లో ఎన్నారై మహిళకు జీవితఖైదు
Published Tue, Nov 18 2014 5:21 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
Advertisement
Advertisement