మోర్తాడ్ (బాల్కొండ): కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో తమ దేశానికి వచ్చే విదేశీయులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కొత్త నిబంధనలను విధించింది. టీకా రెండు డోస్‌లు తీసుకున్న వారు బూస్టర్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన ఈ నెల 10 నుంచి అమలులోకి రానుంది. సాధారణంగా ఎక్కడైనా రెండు డోస్‌ల టీకాలనే ఇస్తున్నారు. మన దేశంలో బూస్టర్ డోస్ కేవలం ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కే ఇవ్వాలని నిర్ణయించారు. ఇతరులకు బూస్టర్ డోస్ ఇచ్చే ఆంశం ఇంకా వైద్య ఆరోగ్య శాఖ పరిశీలనలో ఉంది.
దేశంలో కోవిషీల్డ్ టీకా ఎక్కువగా ఇస్తుండగా మొదటి డోస్‌కు, రెండో డోస్‌కు 84 రోజుల కాలపరిమితి విధానాన్ని అమలు చేస్తున్నారు. కేవలం విదేశాలకు వెళ్లే వారికి వీసా ఉంటేనే నెల రోజుల వ్యవధిలో రెండు డోస్‌ల టీకాలను ఇస్తున్నారు. ఇప్పుడు బూస్టర్ డోస్ అంశాన్ని యూఏఈ తెరమీదపైకి తేవడంతో యూఏఈ వెళ్లే వలస కార్మికులు అయోమయానికి గురవుతున్నారు. వీసా గడువు సమీపించే వారికి కేంద్రం బూస్టర్ డోస్ ఇవ్వాలని కోరుతున్నారు.
డోస్‌ల మీద డోస్‌లు..
దేశంలో 2 డోస్‌ల టీకా కార్యక్రమం ఇంకా సాగుతుండగా యూఏఈలో వలస కార్మికులకు డోస్‌ల మీద డోస్‌ల టీకాలు వేస్తున్నారు. కరోనా మొదటి వేవ్, రెండో వేవ్‌లను దృష్ట్యా చైనా ఉత్పత్తి చేసిన సినోఫాం టీకా రెండు, మూడు డోస్‌లు ఇచ్చారు. సినోఫాం టీకాతో వైరస్ కట్టడి కావడం లేదని తాజాగా ఆ టీకాలు మూడు డోస్‌లు తీసుకున్నవారికి మళ్లీ ఫైజర్ టీకా ఇస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికీ 3, 4 డోస్‌లకు మించి టీకాలు ఇస్తున్నారు.
చదవండి: ఫ్లైట్ ఎక్కేముందు కరోనా నెగెటివ్.. దిగాక పాజిటివ్!!
Comments
Please login to add a commentAdd a comment