చిలకలగూడ: కుటుంబ కలహాల నేపధ్యంలో యువకుడిని కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టిచంపి, పెట్రోలు పోసి అనవాల్లు తెలియకుండా మృతదేహాన్ని దహనం చేసి మూసీ నదిలో పడేసిన కేసులో ఇద్దరు ముద్ధాయిలకు జీవితఖైదు విధిస్తూ సికింద్రాబాద్ 6వ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీ సీఎస్‌ఎస్‌వీ దుర్గాప్రసాద్ సోమవారం తీర్పునిచ్చారు. వివరాలు.. బోయిగూడకు చెందిన పాలవ్యాపారులైన బీ.మల్లేష్, ఎన్. సత్యనారాయణలు సన్నిహితులు. వీరి కుమారులు దయానంద్, శ్రీనివాస్‌లు స్నేహితులు. కాగా, 2011 జనవరి 12వతేది రాత్రి 8 గంటల సమయంలో దయానంద్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. ప్రతాపసింగారం గౌరెల్లి గ్రామ పొరమేరల్లోకి తీసుకెల్లి, కాళ్లుచేతులు కట్టి కర్రలతో దారుణంగా కొట్టి దయానంద్‌ను హతమార్చారు. కారులో మృతదేహన్ని మూసీనది వద్దకు తీసుకువెల్లి పెట్రోలు పోసి నిప్పంటించారు. చేతి వేలికి ఉన్న సిల్వర్‌రింగ్ ఆధారంగా మృతదేహం దయానంద్‌దేనని పోలీసులు గుర్తించారు.
జీవితఖైదు, రూ. 2వేల జరిమానా
దయానంద్ హత్యకేసు సుమారు నాలుగున్నరేళ్లు వాదోపవాదాలు జరిగిన తర్వాత సోమవారం తీర్పు వెలువడింది. హత్యకేసులో ప్రధాన ముద్ధాయిలైన సోదరులు బొల్లబోయిన కృష్ణ (28), బొల్లబోయిన శ్రీశైలం (24)లకు జీవితఖైదు, రూ. 2వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున బొల్లబోయిన మల్లేష్ (60), అశోక్ (21,సాయికుమార్ (22), భాను (22)లకు ఎటువంటి శిక్ష విధించలేదు. ముద్దాయిలను చర్లపల్లి జైలుకు తరలించారు.
హత్యకేసులో ఇద్దరికి జీవితఖైదు
Published Mon, Mar 23 2015 9:55 PM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM
Advertisement