ఐదు నెలల పాపను చంపిన తల్లి | Mother murdered her 5 months baby | Sakshi
Sakshi News home page

ఐదు నెలల పాపను చంపిన తల్లి

Jun 4 2015 2:36 PM | Updated on Jul 30 2018 8:29 PM

కుటుంబకలహాలతో ఓ తల్లి తన ఐదునెలల పాపను చంపేసింది.

చింతకాని (ఖమ్మం జిల్లా) : కుటుంబకలహాలతో ఓ తల్లి తన ఐదునెలల పాపను చంపేసింది. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నర్సింహాపురం గ్రామంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..... నర్సింహాపురం గ్రామానికి చెందిన రవి, రాజేశ్వరీ దంపతుల మధ్య  గత కొంత కాలంగా కుటుంబకలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రాజేశ్వరి తన భర్త పొలం పనులకు వెళ్లాక ఐదు నెలల పాపను హత్య చేసింది. అనంతరం గ్రామ సమీపంలోని ఒక బావిలో పాప మృతదేహాన్ని వేసి వెళ్లిపోయింది. ప్రస్తుతానికి ఆమె పరారీలో ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాప మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement