Srilata
-
బలవంతంగా సిజేరియన్.. శిశువు మృతి
నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రెండు రోజుల క్రితం కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణి కుర్చిలోనే ప్రసవించిన ఘటన మరువక ముందే శనివారం రాత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శంగా మరో ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి వర్గాలు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గ్యారకుంట్లపాలెం గ్రా మానికి చెందిన చెరుకుపల్లి నాగరాజు భార్య శ్రీలత మూడో కాన్పు కోసం ఈ నెల 21న ప్రభుత్వ జన రల్ ఆసుపత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేరింది. పరీక్షించిన వైద్యులు ప్రసవానికి సమయం పడుతుందని వేచిచూడాలని సలహా ఇచ్చారు. ఇటీవల ఆసుపత్రిలో కుర్చిలోనే ప్రసవించిన ఘటనపై స్పందించిన కలెక్టర్ బాధ్యులైన డాక్టర్‌తోపాటు అయిదుగురు నర్సింగ్ ఆఫీసర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ శనివారం గైనిక్ వార్డులోని వైద్యులంతా మూకుమ్మడిగా సెలవులు పెడుతున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రమణమూర్తికి నోటీసులు అందజేసి విధులు బహిష్కరించారు. దీంతో గైనిక్ వార్డులో వైద్యసేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ముందు బాబు బాగున్నాడని చెప్పి.. శనివారం సాయంత్రం వరకు నర్సులు మినహా డాక్టర్లు లేకపోవడంతో విసిగి వేసారిన గర్భిణులు ప్రైవేట్ ఆసుపత్రులకు బయల్దేరారు. ఈక్రమంలోనే శ్రీలతను భర్త నాగరాజు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆటోలో ఎక్కిస్తుండగా ఆసుపత్రి సెక్యూరిటీ, సిబ్బంది అడ్డుకుని బలవంతంగా కా న్పుల వార్డుకు తరలించారు. మీరు బయటకు వెళ్లిపోతే మా ఉద్యోగాలు పోతాయంటూ బతిమిలాడి లోపలకు తీసుకు పోయి సేవలందిస్తామని సూచించారు. రాత్రి 9.30 సమయంలో శ్రీలతకు వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. అయితే అప్పటికే పుట్టిన బాబు మృతి చెందినట్లు తెలిసింది. అయితే ముందుగా బాబు బాగున్నాడని వైద్యులు చెప్పారని, ఆ తరువాత చనిపోయినట్లు చెప్పారని బంధువులు పేర్కొన్నారు. డాక్టర్ల నిర్వాకంపై బంధువులు అర్ధరాత్రి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. బాబు శరీరంపై గాయాలు ఉన్నాయని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు మరణించాడని ఆరోపించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమించి కేసు పెట్టాలని సూచించడంతో నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణమూర్తిని వివరణ కోరగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని, జిల్లా కలెక్టర్‌కు జరిగిన ఘటనపై వివరించామని తెలిపారు. -
పరువు తీస్తామంటూ బ్లాక్మెయిల్
మణికొండ: ముగ్గురు కన్న బిడ్డలను చంపి ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డ కేసును మోకిల పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను బుధవారం నార్సింగి ఏసీపీ కార్యాలయంలో డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. శంకర్పల్లి మండలం, టంగటూరుకు చెందిన నీరటి రవి(40) విజయనగరంలోని జీఎస్ఎన్ ఫౌండేషన్ మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లో వందలాదిమందిని చేర్పించి మోసపోయాడు. మొదట్లో డబ్బులు సక్రమంగానే ఇచ్చిన సదరు ఫౌండేషన్ ఆ తర్వాత చెల్లింపులు నిలిపివేసింది. ప్రతి నెలా వచ్చే డబ్బులు రాకపోవడంతో రవిపై సభ్యుల ఒత్తిడి పెరిగింది. అందులో హోంగార్డు నాగరాజు, అతని భార్య ఒత్తిడి అధికం కావటంతో తన భార్య పేరిట ఉన్న రెండు ప్లాట్ల పత్రాలను తాకట్టు పెట్టి రూ. 18 లక్షలను తెచ్చి ఇచ్చాడు. దీంతో మిగిలిన వారు ఒత్తిడి చేస్తూ వచ్చారు. విషయం తెలుసుకుని శంకర్పల్లి మండలానికి చెందిన విలేకరులు శ్రీను, శ్రీనివాస్, మహేష్, ప్రవీణ్,, శ్రీనివాస్‌రెడ్డి బెదిరించారు. పత్రికల్లో రాయొద్దంటే రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో చివరికి భార్య పుస్తెల తాడును తాకట్టు పెట్టి రూ. 2.50 లక్షలు వారికి ఇచ్చాడు. అయినా వేధింపులు ఎక్కువ కావటంతో మార్చి నెల 3వ తేదీన ఇంట్లో తన ముగ్గురు కుమారులు సాయికిరణ్(13), మోహిత్(11), ఉదయ్‌కిరణ్(9)ల మెడకు తాడుతో బిగించి హత్య చేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఐదు మంది విలేకరులతో పాటు అతన్ని వేధింపులకు గురి చేసిన మరో నలుగురిని గుర్తించి కేసులో చేర్చారు. శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్, హోంగార్డు నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, మిగిలిన ముగ్గురు విలేకరులు పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు. -
అరుదైన సమస్య.. ఆరు నెలల్లో మాయం!
జగ్గయ్యపేట అర్బన్ : వంకరకాళ్లతో జన్మించిన చిన్నారిని జగ్గయ్యపేట పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఆరు నెలల్లోనే మామూలు స్థితికి తెచ్చారు. చిన్నారి తల్లిదండ్రుల మోముల్లో సంతోషాన్ని నింపారు. జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేటకు చెందిన సాయి తారక్, శ్రీలత దంపతులకు ఆరు నెలల కిందట మహన్వితశ్రీ జన్మించింది. జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలోనే జన్మించిన ఆ చిన్నారికి కాళ్లు వంకర్లు తిరిగి ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు కఠారి హరిబాబు సలహాతో వారు అదే ఆస్పత్రిలో ఆర్థోపెటిక్‌గా పనిచేస్తున్న డాక్టర్ హరీష్‌ను కలిసి తమ బిడ్డ పరిస్థితిని వివరించారు. బాలికను పరీక్షించి తల్లిదండ్రులకు ఆయన ధైర్యం చెప్పారు. ఆరు నెలల్లో చిన్నారి కాళ్లు మామూలు స్థితికి చేరుకుంటాయని భరోసా ఇచ్చి.. 21వ రోజు నుంచి చికిత్స మొదలెట్టారు. వారం వారం ఆ చిన్నారి కాళ్లకు కట్లు కడుతూ మధ్యలో ఇంజక్షన్లు ఇస్తున్నారు. మధ్యలో విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యుల ద్వారా కొంత వైద్య సాయం తీసుకున్నారు. ఆరు నెలలు పూర్తి కావస్తుండటంతో చిన్నారి కాళ్లు దాదాపుగా మామూలు స్థితికి వచ్చాయని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ మాట్లాడుతూ చిన్న పిల్లల్లో ఇలాంటి లోపాలు వస్తుంటాయని, దీనిని క్లబ్ ఫుట్(సీటీఈవీ) అంటారని తెలిపారు. పుట్టిన వెంటనే చికిత్స మొదలెడితే ఫలితం ఉంటుందని చెప్పారు. -
నాడీ నారాయణి
అనారోగ్యం నుంచి ఆరోగ్యం వరకు సాగే ప్రయాణంలో రోగికి తోడుగా ఉండేవాళ్లే వైద్యులు. వైద్యవృత్తికి గౌరవం కూడా అదే. అంతే తప్ప ‘ఒకగంటకు ఎంత మంది పేషెంట్లను క్లియర్ చేస్తారు’ అని అడిగే కమర్షియల్ హాస్పిటళ్లలో ఎలా పని చేయాలి? అంటారు డాక్టర్ శ్రీలత. పేషెంట్ తన జేబు చూసుకుని భయకుండా ధైర్యంగా డాక్టర్ దగ్గరకు రాగలగాలి. సామాన్యులకు అలాంటి ధైర్యాన్ని కల్పించడంతోపాటు ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఎంత ప్రభావవంతంగా పని చేస్తుందో సమాజానికి తెలియచేయాలనేదే నా లక్ష్యం’’ అంటున్న డాక్టర్ శ్రీలత ‘సాక్షి’తో తన లక్ష్యాలను, జీవితాశయాలను, వ్యక్తిగత వివరాలను పంచుకున్నారు. ‘‘మీకు నెలకు లక్షల్లో జీతం ఇస్తున్నాం. కాబట్టి మీరు రోజుకు కనీసం ఇంత మంది పేషెంట్లను చూస్తేనే మాకు గిట్టుబాటవుతుంది’ అనే హాస్పిటళ్లలో డాక్టర్లకు అంకిత భావంతో పని చేయాలని ఉన్నా కూడా సాధ్యం కాదు. అక్కడ పేషెంట్ చెప్పింది వినడానికి ఒక అసిస్టెంట్, డాక్టర్ సూచనలను పేషెంట్‌కు వివరించడానికి మరో అసిస్టెంట్ ఉంటారు. డాక్టర్ పేషెంట్ కోసం కేటాయించేది ఒక నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషాలు మాత్రమే. డాక్టర్ వచ్చేటప్పటికే అసిస్టెంట్లు పేషెంట్‌ను బెడ్ మీద రెడీగా ఉంచుతారు. డాక్టర్ చెక్ చేయడానికి వస్తారు. పేషెంట్ ఏదో చెప్పబోతారు. కానీ డాక్టర్ వినిపించుకోరు. చెకప్ చేసిన డాక్టర్ హడావుడిగా వచ్చి తన సీట్లో కూర్చుంటారు. పేషెంట్ డ్రస్ సరిచేసుకుని డాక్టర్ ఎదుట కూర్చునేటప్పటికే పేషెంట్ మెడికల్ ఫైల్లో డాక్టర్ ఏదో రాసి ఉంటారు. ‘ఈ మందులు వాడండి’ అని మాత్రమే చెబుతారు. ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కన్సల్టేషన్ తీసుకున్న స్పెషలిస్ట్ డాక్టర్ పేషెంట్‌తో మాట్లాడే ఏకైక వాక్యం అదొక్కటే అయి ఉంటుంది చాలా సందర్భాల్లో. పేషెంట్ ఇంకా ఏదో అడగడానికి నోరు విప్పేలోపు అసిస్టెంట్ వచ్చి వెలుపలికి నడవమని సగౌరవంగా దారి చూపిస్తారు. అప్పటికే కర్టెన్‌కి అవతల మరో పేషెంట్‌ను బెడ్ మీద రెడీ చేసి ఉంటారు కూడా. డాక్టర్ లేచి ఆ పేషెంట్ దగ్గరకు వెళ్లిపోవడంతో ఇక చేసేదేమీ లేక పేషెంట్ నోటి వరకు వచ్చిన అనేక సందేహాలను గొంతులోనే అదిమిపెట్టుకుని బయటకు వచ్చేయడం జరుగుతుంటుంది. ‘వైద్యం అంటే ఇది కాదు’ అంటారు శ్రీలత. ఒక్కో పేషెంట్‌కి కనీసం పది నిమిషాలయినా కేటాయించకపోతే పేషెంట్‌కీ డాక్టర్‌కీ మధ్య అనుబంధం ఎలా ఏర్పడుతుంది అని ప్రశ్నిస్తారామె. ఒక్కోసారి ఒక పేషెంట్‌కే అరగంట టైమ్ కేటాయించాల్సి ఉంటుంది. ‘కన్సల్టేషన్ ఫీజును టైమ్‌తో కొలవడమంత నేరం మరొకటి ఉండదు. అది వైద్య వృత్తికే అవమానం. వైద్యం పేదవారిని భయకంపితుల్ని చేయరాదు’ అంటారామె. అప్పుడు వినలేదు ‘‘మా నాన్న దశరథరామయ్య ఇండస్ట్రియల్ ఆఫీసర్‌గా కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరుల్లో పని చేశారు. భగవంతుడు మనను ఒక పొజిషన్లో ఉంచేటప్పుడే సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను కూడా మన మీద పెడతాడు. ఆ బాధ్యత నిర్వర్తించకపోతే దేవుడు మనకిచ్చిన పొజిషన్ని అగౌరవ పరచడమే అనేవారాయన. ఆయన తాను నమ్మినట్లే జీవించారు. నాన్నకు నన్ను డాక్టర్ని చేయాలనే కోరిక ఉండేది. అభిమానంగా వైద్యం చేస్తే పేషెంట్లు డాక్టర్‌ను అమితంగా ప్రేమిస్తారు. దేవుడిలాగ చూస్తారు... అని నాకు నచ్చచెప్పేవారాయన. నాకు సైన్సంటే భయం. దాంతో నేనే నాన్నను కన్విన్స్ చేసి కామర్స్ చదివాను. కామర్స్‌లో చేరిన తర్వాత కూడా ఆయన పబ్లిక్ సర్వెంట్ ఉద్యోగమైతే ప్రజలకు సేవ చేస్తున్నామనే సంతోషం ఉంటుందనేవారు. ఆయన కోరిక ప్రకారం సివిల్స్ రాద్దామనే ఆలోచన కలిగింది. అప్పుడే నాన్నకు బ్రెయిన్ హెమరేజ్ వచ్చింది. మూడు నెలలు కోమాలో ఉన్నారు. ఉన్న ఇల్లు అమ్మేసి వైద్యం చేయించాం. టెస్టులకు, ట్రీట్మెంట్కి లక్షలు ఖర్చయ్యాయి కానీ ఆయన మాకు దక్కనే లేదు. ఆయన మరణం నా జీవిత గమనాన్ని మార్చేసింది. కుటుంబాన్ని, నన్ను నేను నిలబెట్టుకోవడమనే బాధ్యత నా ఎదురుగా నిలిచింది. ఎంబీఏ తర్వాత సాప్ కోర్సు చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాను. ఏడాదికి లక్షల ప్యాకేజ్‌తో మా జీవితం గాడిన పడింది. మా వారు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నారు. అలాంటి సమయంలో నా లైఫ్ నేను కూడా ఊహించని విధంగా మరో మలుపు తీసుకుంది. అందరూ తీర్పరులే! మా వారితో ఆన్సైట్లో జర్మనీ వెళ్లాను. నాకు పిల్లలు పుట్టలేదని అప్పటికే అన్ని వైపుల నుంచి ఒత్తిడి మొదలై ఉంది. ఒక మహిళ తల్లికాకపోతే మన సమాజం కూడా తన వంతుగా సలహాలు, తీర్పులిచ్చేస్తుంది. ఆ మానసిక ఒత్తిడితోనే నాకు మల్టిపుల్ అబార్షన్లయ్యాయి. పిల్లల కోసం కార్పొరేట్ వైద్యంలో టెస్ట్‌లకే లక్షల రూపాయలయ్యాయి. అలాంటి సిచ్యుయేషన్‌లో జర్మనీలో ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ నన్ను మార్చేసింది. ఒక సిట్టింగ్‌లో మైగ్రేన్, ఫ్రోజన్ షోల్డర్ సమస్యలు తగ్గిపోవడం... చూశాక నాకూ ట్రై చేద్దామనిపించింది. ఒకసారి చేయించుకున్న తర్వాత దేహంలో మార్పులు స్పష్టంగా తెలిశాయి. దాంతో మొండిగా కంటిన్యూ చేశాను. కన్సీవ్ అయిన తర్వాత నేను ఆక్యుపంక్చర్తోపాటు న్యూఢిల్లీలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి ఎన్డిడివై ఆల్టర్నేటివ్ మెడిసిన్ కోర్సు చేశాను. డాక్టర్ ఫజులూర్ రెహమాన్‌ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆక్యుపంక్చర్. చెన్నైలో ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. సేవా స్పృహ ఉండాలి మా పూర్వీకులు ఆయుర్వేద వైద్యం చేసేవాళ్లు. కుటుంబంలో సంప్రదాయంగా వస్తున్న వైద్యానికి నా వైపు నుంచి అంతరాయం కలగకుండా ఉండటానికే భగవంతుడు నా జీవితాన్ని ఇలా మలుపు తిప్పాడని అనుకుంటాను. అలాగే వైద్యానికి ఇంత ఫీజు నిర్ణయించడం వైద్యశాస్త్రంలోనే లేదు. చెరకు బండి వాళ్లు, కూరగాయల వాళ్లు వంద ఇస్తే అంతే తీసుకుంటాను. సంపన్నులు ధారాళంగా ఇవ్వగలుగుతారు. భగవంతుడు మన దగ్గరకు సంపన్నులైన పేషెంట్లను పంపించాడంటే మన జీవికకు ఆయనే ఒక భరోసా కల్పిస్తూ, పేదవారికి సేవ చేయమని చెప్తున్నాడని అర్థం. రోగానికి పేదరికం, సంపన్నత అనే తేడా ఉండదు. ఆ స్పృహ వైద్యుడికి ఉండాలి. మా నాన్న కోరుకున్నట్లు మంచి వైద్యురాలిగా పేరు తెచ్చుకోవడంతోపాటు మనదేశంలో తక్కువ ఖర్చుతో వైద్యవిధానాలున్నాయని తెలియచెప్పడమే నా జీవితాశయం’’ అన్నారు డాక్టర్ శ్రీలత. ఇంటర్వ్యూ : వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి చట్రంలోకి వెళ్లలేదు ఇప్పుడు చాలా హాస్పిటళ్లలో ఆక్యుపంక్చర్ విభాగాన్ని పెడుతున్నారు. అయితే వాళ్లడిగినట్లు గంటకి ఇంత మందిని చూడాలనే నియమానికి నేను వ్యతిరేకం. పైగా ఈ వైద్యవిధానంలో కొన్ని రకాల సమస్యలకు వైద్యాన్ని కొన్ని సమయాల్లోనే చేయాల్సి ఉంటుంది. పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు వరకు విరామం ఇవ్వాలి. ఆ టైమ్‌లో నేను ట్రీట్మెంట్ చేయను... అంటే హాస్పిటళ్లు అంగీకరించవు. అందుకే ఆ చట్రంలోకి వెళ్లలేదు. ఈ వైద్యం చేయాలంటే డాక్టర్ కూడా లైఫ్‌స్టైల్‌ను మార్చుకోవాలి. ఇది అగస్త్య మహాముని ప్రాక్టీస్ చేసిన వైద్యవిధానం. వైద్యులు రోజూ సముద్ర స్నానం చేయాలి. సముద్ర స్నానం అన్ని చోట్లా సాధ్యం కాదు కాబట్టి రాత్రి ఏడు గంటల సమయంలో ఇంట్లో అర బకెట్ నీటిలో మూడు కప్పుల ఉప్పు కలిపి ఆ నీటితో తలారా స్నానం చేయాలి. మరో నియమం ధ్యానం. పేషెంట్ల నుంచి డాక్టర్లకు నెగెటివ్ ఎనర్జీ ప్రసారమవుతుంటుంది. రోజూ ఉదయం ధ్యానం చేసి డాక్టర్లు తమలో పాజిటివ్ ఎనర్జీని నింపుకోవాలి. ఇవన్నీ పాటించాలంటే సోషల్ లైఫ్‌ని కొంత త్యాగం చేయక తప్పదు. పేషెంట్ కళ్లలో కనిపించే సంతోషంకంటే మరేదీ ఎక్కువ కాదు. – డాక్టర్ శ్రీలత -
మలుపుల సరోవరం
విశాల్ వున్న, ప్రియాంకా శర్మ, శ్రీలత, తనికెళ్ల భరణి, ‘ఛత్రపతి’ శేఖర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సరోవరం’. సురేష్ యడవల్లి దర్శకత్వంలో శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. శ్రీలత నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో సురేష్ యడవల్లి మాట్లాడుతూ– ‘‘సరోవరం’ అనే గ్రామంలో జరిగిన కథ ఇది. భావోద్వేగంతో నడిచే ఈ కథలోని మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి’’ అన్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు ఎస్.శ్రీలత. ‘‘మాస్కు కావాల్సిన అంశాలతో పాటు యూత్‌ని ఆకట్టుకునే అంశాలు కూడా ఉన్నాయి’’ అన్నారు నటులు ‘జబర్దస్త్’ నవీన్, రాము. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పులి ఈశ్వర్ రావు. -
డెంగీతో వ్యవసాయశాఖ జేడీఏ మృతి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖ సంయుక్త సంచాల కులు (జేడీఏ) మాధవి శ్రీలత (56) డెంగీతో గురువారం మృతిచెందారు. ఆమె హైదరాబాద్ వ్యవసాయశాఖ కమిష నరేట్లో పురుగు మందుల విభాగంలో జేడీఏగా బాధ్య తలు నిర్వహిస్తున్నారు. డెంగీకి గురై మృతిచెందారని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఆమె మృతిపట్ల వ్యవ సాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ డాక్టర్ జగన్మోహన్, అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కె.రాములు సంతాపం వ్యక్తంచేశారు. -
మాయ లేడీ డబుల్ యాక్షన్
• తల్లిగానూ తానే మాట్లాడింది! • కి‘లేడీ’ విచారణలో వెలుగులోకి సిటీబ్యూరో: మాట్రిమోనియల్ సైట్‌ను వేదికగా చేసుకుని, నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చెయ్యడం ద్వారా పలువురిని మోసం చేసిన బెంగళూరు వాసి శ్రీలత విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన కేసుల్ని ఏసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. గురువారం ఆమెను సిటీకి తీసుకువచ్చిన అధికారులు కోర్టులో హాజరుపరిచారు. బెంగళూరు సమీపంలోని అత్తూరుకు చెందిన శ్రీలత నిరుపేద రైతు కుటుంబంలో జన్మించింది. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో సోదరి మరణించింది. ఇటీవల భారత్మాట్రిమోని.కామ్ సైట్లో సుస్మిత పేరుతో, అందమైన యువతి ఫొటోతో రిజిస్టర్ చేసుకున్న శ్రీలత మోసాలకు తెర లేపింది. నగరానికి చెందిన శేషు అనే యువకుడు ఆసక్తి చూపడంతో అతడితో ఫోన్లో, వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్ కొనసాగించింది. ఓ దశలో తన కుటుంబీకులు మీ కుటుంబసభ్యులతో మాట్లాడాలని శేషు కోరడంతో మరో నాటకానికి తెర లేపింది. తానే గొంతు మార్చి మాట్లాడిన శ్రీలత ‘తల్లి’గా పరిచయం చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న పెళ్లి చూపులకూ ముహూర్తం ఖరారు చేసింది. అంతలో విలువైన వస్తువులు, క్రెడిట్‌కార్డ్స్, రూ.40 వేలు ఉన్న పర్సు పోయిందంటూ శేషును సంప్రదించి ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయమంది. ఇలా వివిధ సందర్భాల్లో రకరకాల కారణాలు చెబుతూ ఫిబ్రవరి 2 వరకు మొత్తం రూ.1,66,500 స్వాహా చేసింది. ఆ మరుసటి రోజు నుంచే ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో పెట్టడంతో పాటు ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా చేసింది. మరోపక్క సిటీకి చెందిన తేజ అనే యువకుడితోనూ పరిచయం పెంచుకున్న శ్రీలత తమకు బంజారాహిల్స్, సిటీ శివార్లతో పాటు బెంగళూరులో పలు భవనాలు ఉన్నట్లు చెప్పింది. దాదాపు రూ.28 కోట్ల ఆస్తి తన పేరిట ఉండగా... ఇటీవల సోదరుడు చనిపోయాడని, వదిన గొడవపడి రూ.12 కోట్ల ఆస్తి పట్టుకుపోయిందని నమ్మించింది. తన తండ్రి సింగపూర్ ట్రిప్‌లో ఉన్నాడంటూ వివిధ కారణాలు చెబుతూ రూ.2.78 లక్షలు కాజేసింది. ఈ నగదును తన తండ్రితో పాటు సోదరి భర్త ఖాతాల్లో డిపాజిట్ చేయించుకుంది. వీటితో జల్సాలు చేస్తూ పరిచయస్తులు, బంధువులకు అనుమానం రాకుండా ఉండేందుకు మరో ఎత్తు వేసింది. బెంగళూరుకు చెందిన భారీ వ్యాపార సంస్థ టోటల్ మాల్లో మేనేజర్‌గా పని చేస్తున్నానని, నెలకు రూ.45 వేల జీతం వస్తోందని నమ్మించింది. సిటీకి చెందిన మరో ఇద్దరు యువకులకూ ఎరవేసినప్పటికీ... కోటీశ్వరురాలినని చెబుతూ డబ్బు అడగటంతో వారు అప్రమత్తమయ్యారు. -
విద్యార్థులు ఇతివృత్తంగా నెరి
నెరి చిత్రం టాకీ పార్టును పూర్తి చేసుకుందని ఆ చిత్ర నిర్మాత మోహన్‌కుమార్ తెలిపారు. ఈయన కథ, కథనం, మాటలు సమకూర్చి కథానాయకుడిగా నటిస్తూ అమోఘా ఫిలిం మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం నెరి. శ్రేయశ్రీ,, సత్యకళ కథానారుుకలుగా నటిస్తున్న ఇందులో కింగ్‌కాంగ్, స్వతంత్రదాస్, శ్రీలత, పరుుల్‌వాన్ రంగనాథన్, బాలతారలు ఎం.శివాని, ఎం.భరత్ నటిస్తున్నారు. విలన్‌గా భగవతిబాలా నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలను భగవతిబాలా నిర్వహిస్తున్నారు.రమేష్‌భారతి, స్వతంత్రదాస్, ప్రత్యూగన్, కార్తికేయన్, నందుదాసన్, ఐదుగురు గీత రచరుుతలు రాసిన పాటలకు కే.రాజ్‌భాస్కర్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను నిర్మాత, కథానాయకుడు మోహన్‌కుమార్ తెలుపుతూ నక్క వేషాలను వేసే విద్యార్థులను సక్రమ మార్గంలో పెట్టడం ఉపాధ్యాయులకు శ్రమతో కూడిన కార్యమేనన్నారు. అలాంటి విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న కథా చిత్రం నెరి అని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను ఒకే షెడ్యూల్లో కరూర్, ఊటీ, కోడైక్కానల్, ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో నిర్వహించి 60 రోజుల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. పాటలను బెల్జ్జియం, మలేషియా, సింగపూర్లలో చిత్రీకరించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. -
నా భర్త నాకు కావాలి
వనస్థలిపురం: తనను ఇక్కడే వదిలేసి అమెరికా చెక్కేసిన ఎన్ఆర్ఐ భర్త ఇంటి ఎదుట ఓ మహిళ ఆందోళనకు దిగింది. కోడలు వస్తున్న విషయం ముందే గ్రహించిన అత్తా, మామలు ఇంటికి తాళం వేసుకుని ఉడారుుంచారు. వివరాల్లోకి వెళితే..నల్లగొండ జిల్లా తంగడవల్లికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి దేశగోని వెంకటేష్ కుమార్తె శ్రీలతను వనస్థలిపురం వైదేహినగర్కు చెందిన గంగపురం సత్యనారాయణ కుమారుడు మధుకర్‌కు ఇచ్చి 2014లో వివాహం జరిపిం చారు. మధుకర్ యూఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. పెళ్లరుున తర్వాత భార్య శ్రీలతను కూడా తనతోపాటు తీసుకెళ్లాడు. తొమ్మిది నెలల క్రితం భార్యా, బిడ్డలతో కలిసి ఇండియాకు వచ్చిన మధుకర్ వారిని పుట్టింటిలో వదిలి ఏడు నెలల క్రితం యూఎస్ తిరిగి వెళ్లిపోయాడు. అప్పటినుంచి కాంటాక్టులో లేడని, ఫోన్ చేసినా ఎత్తడం లేదని శ్రీలత తెలిపింది. అత్తా, మామలను సంప్రదించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో చేసేది లేక శుక్రవారం పెద్దమనుషులను తీసుకుని అత్తారింటికి రాగా, అప్పటికే అత్తా, మామ తాళం వేసుకుని పరారు కావడంతో వారి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు.. పెళ్లి సమయంలో ఇచ్చిన ఎకరం భూమిని తన పేరున మార్పించాలని మధుకర్ కొంతకాలంగా వేధిస్తున్నాడని శ్రీలత, ఆమె తండ్రి వెంకటేష్ తెలిపారు. ఇప్పటికే మధుకర్ తన పేరున ఉన్న ఆస్తి మొత్తం ఆయన అక్క పేరున మార్పించినట్లు తెలిపారు. భూమిని తన కూతురు, మనవరాలి పేరిట చేరుుంచడానికి సిద్ధంగా ఉన్నానని, తన కూతురికి న్యాయం చేయాలని కోరారు. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ మద్ధతు... విషయం తెలుసుకున్న సిటిజెన్స ఫస్ట్ హ్యూమన్‌రైట్స్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి జగదీశ్వరి, హైదరాబాద్ అధ్యక్షురాలు చీల రోజా రమణి, నాగోలు అధ్యక్షురాలు రంగేశ్వరి శ్రీనివాస్ అక్కడికి చేరుకుని శ్రీలతకు మద్ధతుగా నిలిచారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసి శ్రీలతకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
ఆ కేసు అత్తమామలపై కూడా వేయచ్చు!
గృహహింస :: కేస్ స్టడీ శ్రీలత వివాహమై నాలుగేళ్లయింది. భర్త ఐటీ ఉద్యోగి. రెండేళ్ల బాబు. దురదృష్టవశాత్తూ అనారోగ్యంతో భర్త మరణించాడు. అప్పటిదాకా భర్త, అత్తమామలతో కలిసి ఉన్న శ్రీలత పుట్టింటికి చేరింది. పుట్టెడు దుఃఖంతో ఉండి ఏ వ్యవహారాలూ పట్టించుకోలేదు. అత్తగారింట్లో దాదాపు యాభై తులాల బంగారం ఉండిపోయింది. బీరువాలో ఉంచి అత్తగారే తాళం వేశారు. భర్తచనిపోయిన నెలవరకూ అత్తింటివాళ్లు సానుభూతి చూపారు. ఏమైందో ఏమో హఠాత్తుగా వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. శ్రీలత వల్లే తమ కుమారునికి ఆరోగ్యం దెబ్బతిందనీ, ఆమె కారణంగానే అతను మరణించాడనీ, ఆమె జాతకం బాగోలేదనీ నిందించసాగారు. లేనిపోని అభాండాలు వేస్తూ, కొడుకే తమకు కాకుండా పోయాక కోడలితో తమకిక ఏ సంబంధమూ లేదని తెగేసి చెప్పారు. శ్రీలత వారి కడుపుకోతని అర్థం చేసుకుని మిన్నకుండింది. అత్తగారింటినుండి ఏ సహాయమూ ఆశించలేదు, అందలేదు. కానీ బీరువాలో ఉన్న నగలు ఆమె పుట్టింటివారు పెట్టినవి. అవి ఆమె స్త్రీ ధనం. వాటికోసం అత్తగారిని అడిగితే ఆమె ససేమిరా అన్నారు. తమకేం తెలీదని, శ్రీలతే వాటిని తీసుకొని వెళ్లిందని గొడవ పెట్టుకున్నారు. అత్తగారు ఆ నగలను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి శ్రీలత విస్తుపోయింది. తెలిసినవారు గృహహింస కేసు వేయమన్నారు. సాధారణంగా ఆ కేసులు భర్తలపై వేస్తారు కదా! మరి అత్తగారిపై వేయవచ్చా అనే సందేహంతో న్యాయవాదిని ఆశ్రయించింది. అత్తమామలపై ఖచ్చితంగా కే సు వేయవచ్చునని, శ్రీలతకు వారు వివాహం ద్వారా బంధువులవుతారని, అందువల్ల గృహహింస చట్టం ప్రకారం వారిపై కేసు వేయవచ్చునని న్యాయవాది తెలిపారు. నగలకు సంబంధించిన బిల్లులు, బీరువాలో అత్తగారు భద్రపరిచిన విషయం తెలిసిన సాక్షులు, కట్టుబట్టలతో పుట్టింటికి వెళ్లిన వైనం తెలిసిన శ్రేయోభిలాషులు ఉండడంతో ఊపిరి పీల్చుకొని కే సు వేసి, తన స్త్రీధనం దక్కించుకోవాలని నిర్ణయించుకుంది శ్రీలత. -
ఎంబీఏ విద్యార్థిని వేధించిన వ్యక్తి అరెస్ట్
తనను ప్రేమించకపోతె యాసిడ్ పోస్తానని బెదిరించిన యువకుడి పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి అతన్ని ఆదివారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కదిరికి చెందిన శ్రీలత(24) జేఎన్టీయూ అనంతపురంలో 2013-15 బ్యాచ్‌లో ఎంబీఏ చదివింది. విద్యార్థి దశలో కళాశాలలో గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చిన సుశిల్ కుమార్ అనే ఉపాధ్యాయుడు ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. అప్పటి నుంచి తనను ప్రేమించాలని.. లేకపోతె కుటుంబ సభ్యులందరిని హతమారుస్తానని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన శ్రీలత గత నెల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సుశిల్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. సుశిల్‌కుమార్ మద్రాస్ ఐఐటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొంది కదిరిలో గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాడు. -
పెళ్లైన ఏడాదికే.. అనుమానాస్పద స్థితిలో మృతి
ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన నగరంలోని సాగర్ రింగ్‌రోడ్డు తిరుమల నగర్‌లోని సాగర్ కాంప్లెక్స్‌లో బుధవారం అర్థ రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న శ్రీలత(24)కు నాగరాజుతో ఏడాది క్రితం వివాహమైంది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున శ్రీలత అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని కనిపించింది. ఇది గుర్తించిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదనపు కట్నం కోసమే తమ కూతుర్ని పొట్టన పెట్టుకున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
తిరుపతి కాల్ మనీ వ్యవహారంపై స్పందించిన ఎస్పీ
-
తిరుపతి కాల్ మనీ వ్యవహారంపై స్పందించిన ఎస్పీ
కాల్‌మనీ బాధితురాలు శ్రీలత వ్యవహారంపై సాక్షి ప్రసారం చేసిన కధనానికి జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్లీ స్పందించారు. బాధితురాలిని వేధించిన కానిస్టేబుల్ కొండారెడ్డిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని బాధితురాలికి భరోసా ఇచ్చారు. కానిస్టేబుల్ కొండారెడ్డికి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని సూచించారు. -
వివాహిత ఆత్మహత్య
ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఒక వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. దండేపల్లి పెద్దపేటలోని పుట్టింటికి వచ్చిన శ్రీలత(32) పుట్టింటికి వచ్చిన ఆమె.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సమస్యలు, అత్తింటి వేధింపులే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అరికాళ్లలో మంటలు, తిమ్మిర్లు..!
నా వయసు 51 ఏళ్లు. రెండేళ్ల నుంచి నా కాళ్లలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు చాలా బాధపెడుతున్నాయి. నాకు బీపీ, షుగర్ వ్యాధులు, చెడు అలవాట్లు కూడా లేవు. అయినా ఈ సమస్యేమిటి? - వెంకటేశ్వర్లు, భువనగిరి కాళ్లలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు, కాలి చివర మొద్దుబారడం వంటి లక్షణాలు నరాల నుంచి వెన్నుపాము వరకు వచ్చే సమస్యల సూచికలు. ఈ సమస్య పెరుగుతూ పోతే చేతులకు కూడా వస్తుంది. అలాగే నడకలో మార్పు, మలమూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, అంగస్తంభనలో కూడా ఇబ్బందులు ఉండవచ్చు. వీటినే పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. ఈ కండిషన్‌కు ప్రధాన కారణాలు డయాబెటిస్, విటమిన్ బి12, బి1, ఫోలిక్ యాసిడ్, ప్యాంటథెనిక్ యాసిడ్ లోపాలు ఉండవచ్చు. కొన్నిసార్లు లెప్రసీ, హెచ్ఐవీ, హెపటైటిస్-బి అండ్ హెపటైటిస్ సి వైరస్ ల వంటివి కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. సాధారణంగా 30 శాతం మందిలో ఏ కారణం లేకుండా కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటివారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. పై లక్షణాలను నియంత్రించడా నికి గాబాపెంటిన్, ప్రీగాబాలిన్, అమీట్రిప్టిలిన్, డ్యూలోక్సె టిన్ మందులతో పాటు, మీ కండిషన్‌కు ఏ అంశం కారణమో దానికి కూడా వైద్యం చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. అంటే ఉదాహరణకు బీ12 లోపం వల్ల ఈ కండిషన్ వస్తే దాన్ని భర్తీ చేయడం అన్నమాట. ఈ లక్షణాలున్నప్పుడు అరికాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకుంటే చిన్న పుండ్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. కొన్నిసార్లు రక్తప్రసరణలో ఇబ్బందులు, వెన్నుపాము జబ్బులు కూడా ఇలాంటి లక్షణాలను కలిగించవచ్చు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 44 ఏళ్లు. నాకు గత రెండేళ్ల నుంచి అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయి. మందులు వాడినప్పుడు తగ్గి మళ్లీ మళ్లీ ఈ సమస్య వస్తోంది. అలా అవుతున్నప్పుడు నాకు భయమేస్తోంది. దీనికి పూర్తిగా పరిష్కారం లేదా? - శ్రీలత, అనకాపల్లి మనల్ని సరిగ్గా అంటే బ్యాలెన్స్డ్గా నిలబెట్టే ప్రధాన భాగం చిన్నమెదడు, చెవి మధ్య ఉన్న ‘వెస్టిబ్యులార్ నరం’. చిన్నమెదడుకు వచ్చే జబ్బుల వల్ల మీరు పేర్కొన్న వర్టిగో లక్షణాలతో పాటు ఇతర లక్షణాలు కూడా ఉండవచ్చు. అంటే చూపులో, మాటలో, నడకలో, స్పర్శలో, బలంలో మార్పులు ఉంటే తక్షణం న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. అలా కాకుండా కేవలం కళ్లు తిరగడం, వినికిడి తగ్గడం, చెవిలో శబ్దం రావడం ఉంటే అవి చెవి నరానికి సంబంధించిన నరం వరకు వచ్చి సమస్య మాత్రమే. తలతిప్పినప్పుడు మాత్రం వచ్చే సమస్యకు, తక్షణ ఉపశమనానికి బీటాహిస్టిన్, సిన్నరజిన్ లాంటి మందులు ఉపయోపడతాయి. కొన్నిసార్లు ఇది మళ్లీ మళ్లీ వస్తుంది. అలా తరచుగా వచ్చేవారికి వెస్టిబ్యులార్ ఎక్సర్‌సెజైస్, ఎప్లేస్ మెథడ్ ద్వారా చికిత్స అవసరం. అప్పటికీ ఫలితం కనిపించకపోతే చెవి నరానికి కొన్ని ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా దీన్ని నియంత్రించ వచ్చు. ఇది కాస్త సతాయిస్తుంటుంది కానీ ప్రమాదకరం కాదు. కాబట్టి ఆందోళన చెందకండి. డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి చీఫ్ న్యూరాలజిస్ట్ సిటీ న్యూరో సెంటర్ మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్ -
తెగిన అనుబంధం
వారిది అన్యోన్య దాంపత్యం.. భర్తే లోకంగా ఆమె, భార్యే ప్రపంచంగా ఆయన బతికారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా తనయ పుట్టింది. ప్రజాసేవకు అవకాశం కలసిరావడంతో ఆయన ప్రోత్సహించారు. ఆమె ప్రజాప్రతినిధిగా ఎన్నికై తమ ప్రాంత ప్రజల కోసం నిత్యం పరితపించేవారు. అయితే ఆ దంపతులపై విధి కన్నుకుట్టింది. వారం కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భర్తను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసుకుని ఇంటికి బయలుదేరారు. మరి కాసేపటిలో ఇంటికి చేరుకుంటామనగా జరిగిన ప్రమాదంలో ఆమెను మృత్యువు కబళించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కృష్ణగిరి/ప్యాపిలి : వెల్దుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొమ్మిరెడ్డిపల్లె గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్యాపిలి ఎంపీటీసీ-1 సభ్యురాలు బోరెడ్డి శ్రీలత(26) అక్కడిక్కడే దుర్మరణం చెందారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం కరిటికొండ వద్ద వారం కిందట జరిగిన బైక్ ప్రమాదంలో శ్రీలత భర్త గోపీనాథ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఆస్పత్రి నుంచి భర్తను డిశ్చార్జ్ చేసుకుని స్వగ్రామానికి వచ్చేందుకు భర్తతో కలసి ఆమె ప్యాపిలిలో ఆటో ఎక్కారు. అయితే వారు ప్రయాణిస్తున్న ఆటో మార్గమధ్యంలోని బోమ్మిరెడ్డిపల్లె సమీపానికి రాగానే డివైడర్‌ను ఢీకొని బోల్తాకొట్టింది. సంఘటనలో శ్రీలత అక్కడికక్కడే మరణించారు. అదే ఆటోలోని భర్త గోపీనాథ్‌రెడ్డి, బావ రఘునాథరెడ్డి గాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న వె ల్దుర్తి ఎస్ఐ నాగేంద్ర తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను, మృతదేహాన్ని డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. చివరి చూపు కోసం.. తమ ప్రజాప్రతినిధి రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యువాతపడినట్లు తెలియగానే ప్యాపిలి ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. డోన్ ప్రభుత్వస్పాత్రిలో పోస్టుమార్టం అనంతరం శ్రీలత భౌతికకాయాన్ని ప్యాపిలికి తీసుకురాగానే ఆమెను కడసారి చూసుకునేందుకు జనం భారీగా తరలివచ్చారు. ప్యాపిలి సర్పంచ్ గౌసియాబేగం, ఎమ్మెల్యే రాజారెడ్డి పీఓ అంకిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజా నారాయణమూర్తి, మల్లికార్జునరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, బషీర్, సురేంద్ర, ఎస్కే వలి, రమణ తదితరులు శ్రీలతకు నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ అభిమానిగా.. ప్యాపిలికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బోరెడ్డి శ్రీరామిరెడ్డి కుమారుడు గోపీనాథరెడ్డితో కర్ణాటకలోని బళ్లారి సమీపంలో గల కొర్లగొందికి చెందిన జ్యోతి, గోవిందరెడ్డి దంపతుల కుమార్తె శ్రీలత వివాహం ఏడేళ్ల కిందట అయింది. వారికి తనయ అనే కుమార్తె పుట్టింది. వారి కుటుంబం మొత్తం వైఎస్సార్ సీపీ అభిమానులే. ఆ అభిమానమే శ్రీలతను గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేలా చేసింది. ఆమె ప్యాపిలి-1 ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఎంపీపీ రేసులో ఉన్న ఆమెకు, రాజకీయ పరిస్థితులు అనుకూలించలేకపోయాయి. తనయను చూసి తల్లడిల్లి.. రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీలతకు రెండేళ్ల కుమార్తె తనయ ఉంది. ఆమెను తాత బోరెడ్డి శ్రీరామిరెడ్డి ఎత్తుకుని బిగ్గరగా ఏడ్వడం అందరినీ కలచివేసింది. ఇక తన తల్లి రాదని తెలియని ఆ చిన్నారి బిత్తర చూపులు చూస్తుండగా, ‘కన్నా.. మీ అమ్మ ఇక రాదమ్మా’ అంటూ తాత ఆ పసి కూనను గుండెలకు హత్తుకోవడం అక్కడికి వచ్చిన వారి హృదయాలను బరువెక్కించింది. లతా.. ఒక్కసారి పలకవా.. తన కళ్లెదుటే భార్య రక్తపు మడుగులో కొట్టుకుని ప్రాణాలొదలడం చూసి శ్రీలత భర్త గోపీనాథరెడ్డి రోదించిన తీరు పిండేసింది. విగతజీవిగా మారిన భార్యను చూసి ఆయన ‘లతా.. ఒక్కసారి మాట్లాడవా.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావే.. ఒక్కదానివే ఎలా వెళ్లిపోయావురా.. ఇక మన బిడ్డ తనయకు దిక్కెవర్రా... ఆ బిడ్డ అమ్మేదని అడిగితే.. నేనేమని చెప్పగలనురా... అంటూ గోపీనాథరెడ్డి పిచ్చివాడిలా రోదించడం ప్రతి ఒక్కరి కంట కన్నీరు తెప్పించింది. అతన్ని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. -
ప్రేయసి మృతితో ప్రియుడి ఆత్మహత్య
తిరుపతిక్రైం: ప్రియురాలు మృతి చెందడంతో మనస్తాపానికి గురైన ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన సోమవారం తిరుపతి ఇం దిరానగర్లో చోటు చేసుకుంది. వెస్ట్ సీఐ అం జూయాదవ్ కథనం మేరకు.. సరళ సులభ్లో పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు. భర్త లేకపోవడంతో ఈమె పిల్లలను అల్లారుముద్దుగా పెంచింది. కొడుకు దినేష్(18) కొంతకాలంగా అక్క కూతురు శ్రీలత ను ప్రేమిస్తున్నాడు. ఏమైందో ఏమో కానీ వీరి మ ద్య నెల నుంచి మాటలు లేవు. ఈ నేపథ్యంలో 5వ తేదీన చెన్నైలో శ్రీలత ఆత్మహత్యకు పాల్పడింది. దినేష్ హుటాహుటిన తల్లి, తన చెల్లితో పాటు చెన్నై వెళ్లాడు. అక్కడ శ్రీలత అంత్యక్రియలు పూర్తిచేసుకుని తిరిగి తిరుపతికి ఆదివా రం రాత్రి చేరుకున్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, శ్రీలత లేని జీవితం వ్యర్థం అంటూ సూసైడ్ నోట్ రాశాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. స్కూల్ నుంచి వచ్చిన చెల్లెలు చూసి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. అప్పటికే దినేష్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని రుయా మెడికల్ కళాశాలకు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏసీబీ వలలో ఎక్సైజ్ ఈఎస్
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : మూమూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు జోగుతున్నారు. ఎక్సైజ్ అధికారుల తీరు దొరికితే దొంగలు లేకపోతే దొరలనే చందంగా ఉందని ప్రజానీకం అంటున్నారు. సోమవారం ఎక్సైజ్ సూపరింటెండెట్ బీ.శ్రీలత, జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ నెల వారీ మూమాళ్లు తీసకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. నాకే పాపం తెలియదు.. ఈఎస్ గారి ఆదేశాలు పాటించా . తాను సమ్మెలో ఉన్నానని తనకే పాపం తెలియదని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ వాపోయారు. తాను సమ్మెలో ఉన్నానని ఈఎస్ పిలిచి మద్యం వ్యాపారి డబ్బు ఇస్తాడు తీసుకో మని చెప్పారని, అంతకు మించి తనకే పాపం తెలియదని ఆయన లబోదిబోమంటున్నాడు. అధికారికి సంబంధం లేకుండా చిన్న ఉద్యోగినైన తనకు అంత డబ్బు ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. అంతా అబద్ధం...లంచం డిమాండ్ చేయలేదు : ఈఎస్ కాగా ఏసీబీ దాడి అనంతరం మీడియా ప్రతినిధులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీలతను విరరణ కోరగా తాను లంచం తీసుకోలేదని, జూనియర్ అసిస్టెంట్ అబద్ధం చెబుతున్నాడని అన్నారు. తన చేతులకు రంగు అంటలేదని చేతులను చూపించారు. తాను డీసీ కార్యాలయంలో మీటింగ్‌లో ఉన్నానని తనను ఏసీబీ అధికారులు ఫోన్ చేసి పక్కనే ఉన్న కార్యాలయానికి రమ్మని పిలిచారని చెప్పారని ఆమె చెప్పారు. జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకున్నాడని, తమకు దర్యాప్తులో సహకరించమని ఏసీబీ అధికారులు కోరారని అంతకు మించి తనకేమి తెలియదన్నారు. కొద్ది రోజుల క్రితం కృష్ణలంకలో కనకదుర్గా బార్ అండ్ రెస్టారెంట్‌పై తనిఖీ చేసి జరిమానా విధించానని చెప్పారు. లంచం డిమాండ్ చేశారు: ఏసీబీ డీఎస్ఫీ విజయపాల్ కాగా ఎక్సైజ్ సూపరింటెండెట్ శ్రీలత లంచం డిమాండ్ చేశారని ఏసీబీ డీఎస్పీ ఆర్. విజయపాల్ అన్నారు. అమె లంచం డిమాండ్ చేసినట్లు తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఆమె డెరైక్టుగా లంచం తీసుకోలేదన్నారు. జూనియర్ అసిస్టెంట్ రూ.40వేలు తీసకున్నాడని, ఆడబ్బును శ్రీలతకు ఇవ్వబోతుండగా తాము వలపన్ని పట్టుకున్నామని చెప్పారు. శనివారం బార్ షాపు యజమాని తమకు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. ఆ ఫిర్యాదుపై తాము విచారణ జరిపి నిందితులిద్దరిని అరెస్టు చేశామని చెప్పారు. నిందితులను మంగళవారం కోర్డులో హాజరు పరుస్తామని అన్నారు.