ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన నగరంలోని సాగర్ రింగ్‌రోడ్డు తిరుమల నగర్‌లోని సాగర్ కాంప్లెక్స్‌లో బుధవారం అర్థ రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న శ్రీలత(24)కు నాగరాజుతో ఏడాది క్రితం వివాహమైంది.
ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున శ్రీలత అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని కనిపించింది. ఇది గుర్తించిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదనపు కట్నం కోసమే తమ కూతుర్ని పొట్టన పెట్టుకున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.