చింతల్ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో దుర్గా(30) అనే వివాహిత అనుమానాస్పద స్థితితో మృతిచెందింది.
చింతల్ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో దుర్గా(30) అనే వివాహిత అనుమానాస్పద స్థితితో మృతిచెందింది. ప్రమాదవశాత్తూ సంపులో పడి చనిపోయిందని భర్త చెబుతున్నాడు. ఈ ఘటనపై పుట్టింటివారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.