అల్వాల్ లోతుకుంట వాటర్ ట్యాంకులో మృతదేహం కలకలం రేపింది.
అల్వాల్ లోతుకుంట వాటర్ ట్యాంకులో మృతదేహం కలకలం రేపింది. వాటర్ ట్యాంక్ లో మృతదేహం ఉండటాన్ని గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతేదహాన్ని బయటుకు హత్య చేసి పడేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. మృతుడు స్థానికంగా నివాసముంటున్న పేయింటర్ సత్యనారాయణగా గుర్తించారు. ప్రస్తుతం అల్వాల్, బొల్లారం, లోతుకుంట, తిరుమల గిరికి నీళ్ల సరఫరాను నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు.