స్టూడియో ఎదుట ఆందోళన చేస్తున్న బంధువులు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని అన్నపూర్ణ స్టూడియోలో ఓ మేస్త్రీ అనుమానాస్పద మృతి ఉద్రిక్తతకు దారి తీసింది. నాగర్‌కర్నూల్ జిల్లా, గోదాల గ్రామానికి చెందిన ఎద్దుల నారాయణరెడ్డి(50) రాజేంద్రనగర్‌లో ఉంటూ మేస్త్రీగా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో సెట్టింగ్ నిర్మాణ పనులు చేస్తున్న అతను జారి కిందపడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఉదయం 11 గంటలకు ప్రమాదం జరగగా సాయంత్రం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారని అతని భార్య పద్మతోపాటు బంధుమిత్రులు ఆరోపిస్తున్నారు. సాయం త్రం బంధువులకు ఫోన్ చేసిన స్టూడియో యాజ మాన్యం నారాయణరెడ్డికి దెబ్బలు తగిలాయని ఉస్మానియాలో చికిత్స పొందుతున్నట్లు చెప్పడం తో అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది నట్లు వైద్యులు తెలిరన్నారు.
స్టూడియో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నారాయణరెడ్డి మృతి చెందాడిని ఆరోపిస్తూ అతని బంధువులు గురువారం మధ్యాహ్నం మృతదేహంతో అన్నపూర్ణ స్టూడియో ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. వీరికి సీఐటీయూ, సీపీఎం నేతలు మద్దతుగా నిలిచారు. దీంతో ఆప్రంతంలో ఉద్రిక్తత నెలకొంది. జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. స్టూడియో ఎస్టేట్ మేనేజర్ రెడ్డి మృతుడి బంధువులతో చర్చలు జరిపారు. రూ. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలంటూ మృతుడి బంధువులు డిమాండ్ చేయగా రూ.1 లక్ష ఇస్తామంటూ మేనేజర్ చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే భైఠాయించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment