Annapurna Studio
-
బిగ్‌బాస్ ఫైనల్‌కు భారీ భద్రత
బంజారాహిల్స్: ఈ నెల 15వ తేదీన బిగ్‌బాస్ సీజన్–8 ఫైనల్ జరగనున్న నేపథ్యంలో ఇందుకోసం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అల్లర్లు, గొడవలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–5లోని అన్నపూర్ణ స్టూడియో ఏడెకరాల్లో బిగ్‌బాస్ సెట్టింగ్ వేయగా..ఫైనల్ కూడా ఇక్కడే జరగనుంది. గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన బిగ్‌బాస్ సీజన్–7 ఫైనల్ సందర్భంగా తలెత్తిన పరిణామాలు, గొడవలు, బస్సులపై రాళ్లు రువ్వడం తదితర అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని ఇప్పటికే పోలీసులు ఆయా పాయింట్లతో కూడిన జాబితాను అన్నపూర్ణ స్టూడియో, బిగ్‌బాస్ యాజమాన్యానికి అందజేశారు. గత ఏడాది ఫైనల్ సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడకు చేరుకున్న అభిమానులు ఒక సందర్భంలో బస్సులపై రాళ్లు రువ్వి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడగా అప్పటి బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌తో పాటు బిగ్‌బాస్, అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యంపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించడంలో పోలీసులకు చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఇక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో చాలామంది తప్పించుకున్నారు. ఈసారి ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే గుర్తించేందుకు వీలుగా బిగ్‌బాస్ షో జరిగే స్టూడియో చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడెక్కడ కెమెరాలు ఏర్పాటుచేయాలో జూబ్లీహిల్స్ పోలీసులు ఆ పాయింట్లను బిగ్‌బాస్ యాజమాన్యానికి అందజేశారు. ఈ నెల 14వ తేదీన ఉదయమే వీటిని అమర్చుకోవాలని సూచించారు. వారంక్రితం యూసుఫ్‌గూడ స్టేడియంలో జరిగిన పుష్ప–2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా నిర్వాహకులు 60 తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఆ రోజు జరిగిన కార్యక్రమంలో భారీగా అభిమానులు రావడంతో 15 మొబైల్ ఫోన్లు, రెండు బంగారు గొలుసులు చోరీకి గురయ్యాయి. చోరులను గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ సీజన్–8 ఫైనల్ సందర్భంగా కూడా చుట్టూ 53 కెమెరాలను ఏర్పాటు చేస్తే పోలీసులకు ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. -
పల్లెటూరి ప్రేమకథ
చైతన్య రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 21న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా యష్ రంగినేని మాట్లాడుతూ– ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిది. చెందు ముద్దు ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా రూపొందించారు. 80 దశకం నేపథ్యంతో పీరియాడిక్ సినిమాగా సాగుతుంది. మా సంస్థకు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రి¯Œ ్స హెన్రీ, కెమెరా: పంకజ్ తొట్టాడ. -
రీ ఎంట్రీ కోసం స్వాతి ఫ్యాన్స్ ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నంతవరకూ ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఆమె బయటకు వచ్చి మాట్లాడటం మొదలు పెట్టాక ఆమె చెప్పే పాయింట్లు, మాట తీరు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ఆమె మరెవరో కాదు, గతవారం ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్. మూడో వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా హౌస్‌లో అడుగుపెట్టి అందరినీ కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే హఠాత్తుగా ఎలిమినేషన్ బాంబును ఆమె నెత్తిన వేశారు. దీంతో షాకైన స్వాతి బయటకు వచ్చాక ఒక్కో ఎపిసోడ్ చూసి ఇంకా నిశ్చేష్టురాలైంది. తను చేసినదానిలో 10 శాతం మాత్రమే చూపించారని వాపోయింది. అభిమాన నటి బిగ్‌బాస్ షోకు మెరుపుతీగలా వెళ్లి రావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆమె హౌస్‌కు మళ్లీ వెళ్లాల్సిందేనంటూ పోరాడుతున్నారు. (హారిక ఫోకస్ అంతా అభిజిత్‌పైనే ఉంది) ఎలిమినేషన్ బిగ్‌బాస్ టీమ్ చేతిలో ఉంది ఈ నేపథ్యంలో స్వాతి దీక్షిత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియో ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. స్వాతి దీక్షిత్ చేసినవాటిని ఎందుకు టెలికాస్ట్ చేయలేదని నిలదీశారు. ఆమెను రీ ఎంట్రీ ద్వారా మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ ఎలిమినేషన్ చూస్తోంటే ప్రతివారం ఎవరెవరిని ఎలిమినేట్ చేయాలనేది బిగ్‌బాస్ టీమ్ ముందుగానే డిసైడ్ అయిపోయినట్లు కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. ఓటింగ్‌లోనూ చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న స్వాతిని కావాలనే పంపించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల చేతిలోనే ఎలిమినేషన్ ఉందని నాగ్ అంటున్నారు. కానీ అలా జరగడం లేదని, అందుకే బిగ్‌బాస్ నచ్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. "ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్, స్వాతి దీక్షిత్‌ను తిరిగి తీసుకురండి" అని ప్లకార్డులు ప్రదర్శించారు. (మాస్టర్‌పై ప్రతీకారం తీర్చుకున్న స్వాతి దీక్షిత్) -
‘చి ల సౌ’ రిలీజ్ డేట్ ఫిక్స్
సుశాంత్ హీరోగా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘చి ల సౌ’.. హృద్యమైన ప్రేమకథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాను జూలై 27న అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాతో రుహానీ శర్మ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమా విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు హీరో సుశాంత్ తెలిపారు. -
అన్నపూర్ణ స్టూడియోలో మేస్త్రీ అనుమానాస్పద మృతి
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని అన్నపూర్ణ స్టూడియోలో ఓ మేస్త్రీ అనుమానాస్పద మృతి ఉద్రిక్తతకు దారి తీసింది. నాగర్‌కర్నూల్ జిల్లా, గోదాల గ్రామానికి చెందిన ఎద్దుల నారాయణరెడ్డి(50) రాజేంద్రనగర్‌లో ఉంటూ మేస్త్రీగా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో సెట్టింగ్ నిర్మాణ పనులు చేస్తున్న అతను జారి కిందపడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఉదయం 11 గంటలకు ప్రమాదం జరగగా సాయంత్రం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారని అతని భార్య పద్మతోపాటు బంధుమిత్రులు ఆరోపిస్తున్నారు. సాయం త్రం బంధువులకు ఫోన్ చేసిన స్టూడియో యాజ మాన్యం నారాయణరెడ్డికి దెబ్బలు తగిలాయని ఉస్మానియాలో చికిత్స పొందుతున్నట్లు చెప్పడం తో అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది నట్లు వైద్యులు తెలిరన్నారు. స్టూడియో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నారాయణరెడ్డి మృతి చెందాడిని ఆరోపిస్తూ అతని బంధువులు గురువారం మధ్యాహ్నం మృతదేహంతో అన్నపూర్ణ స్టూడియో ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. వీరికి సీఐటీయూ, సీపీఎం నేతలు మద్దతుగా నిలిచారు. దీంతో ఆప్రంతంలో ఉద్రిక్తత నెలకొంది. జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. స్టూడియో ఎస్టేట్ మేనేజర్ రెడ్డి మృతుడి బంధువులతో చర్చలు జరిపారు. రూ. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలంటూ మృతుడి బంధువులు డిమాండ్ చేయగా రూ.1 లక్ష ఇస్తామంటూ మేనేజర్ చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే భైఠాయించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం
-
అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం
-
అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగగా రెండు సినిమా సెట్టింగులు కాలిపోయాయి. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది కాస్త ఆలస్యంగా చేరుకోగా.. 4 ఫైరింజన్ల సిబ్బంది మంటలు అదుపు చేసే యత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు.. నష్టం... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ స్టూడియో అక్కినేని కుటుంబానికి చెందిందని తెలిసిందే. సినిమాలతోపాటు పలు సీరియళ్లు, రియాల్టీ షోలు ఇక్కడ షూటింగులు జరుపుకుంటాయి. ఘటన గురించి తెలియగానే హుటాహుటిన అక్కడి చేరుకున్న నాగ్ మీడియాతో మాట్లాడారు. నాగేశ్వరావుగారి జ్ఞాపకార్థం నిలుపుకున్న మనం సినిమా సెట్‌తోపాటు.. చిరు సైరా నరసింహారెడ్డి కోసం వేసిన ఓ సెట్ కాలిపోయినట్లు చెప్పారు. అయితే ప్రమాదంలో ఎవరికీ ఏ హాని కలగకపోవటం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. -
తప్పతాగి.. అర్థరాత్రి యువకుల హల్ చల్
తప్పతాగి వచ్చిన ఏడుగురు యువకులు అర్థరాల్రి బీభత్సం సృష్టించారు. స్థానిక యువకులు ఇద్దరిపై దాడి చేయడమే కాకుండా అడ్డొచ్చిన మరో వ్యక్తిని కత్తితో పొడిచారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం మేరకు... జెబాబాగ్ మురాద్‌నగర్‌కు చెందిన జిమ్ ట్రైనర్ ఎండీ యాసిన్(20), టోలిచౌకీకి చెందిన సేల్స్‌మన్ ఫుర్హాన్‌బేగ్ (18), చార్మినార్‌కు చెందిన విద్యార్థులు హేమంత్ శర్మ (20), నిఖిల్ శర్మ (21), ఆకాష్ శర్మ (23), టోలీచౌకికి చెందిన మొజం సిద్దిఖ్ (22), గోల్కొండకు చెందిన అఫాన్ (19) కలిసి మంగళవారం రాత్రి 11.30కి పాతబస్తీ నుంచి మూడు బైక్‌లపై జూబ్లీహిల్స్ రోడ్డు నెం.5లోని అన్నపూర్ణ స్టూడియో ఏడెకరాల రోడ్డు వద్ద ఉన్న కొంత మంది హిజ్రాల వద్దకు వచ్చారు. అదే సమయంలో పక్కనే ఉన్న దుర్గాభవానీనగర్‌కు చెందిన శీను, వెంకటేష్‌లు రోడ్డు పక్కన నిలబడి మాట్లాడుకుంటున్నారు. తమ చేష్టలను శీను, వెంకటేష్ గమనిస్తున్నారని భావించిన ఏడుగురూ.. మీకు ఇక్కడేం పని? ఎందుకు నిలబడ్డారు.. బస్తీలోకి పొండి అని హెచ్చరించారు. మా బస్తీలో మేము నిలబడితే అడగటానికి మీరెవరంటూ శీను, వెంకటేష్ చెప్పగా ఆగ్రహం పట్టలేక ఏడుగురూ వీరిద్దరినీ చితకబాదారు. బాధితులిద్దరూ ప్రాణభయంతో పరుగు తీస్తూ బస్తీవాసులను అప్రమత్తం చేస్తుండగా.. మళ్లీ దాడి చేసేందుకు బస్తీలోకి వెళ్లారు. బస్తీవాసి రమావత్‌సేత్యా వారిని అడ్డుకోబోగా వారిలో ఒకడు తమ వెంట తెచ్చుకున్న కత్తితో సేత్యా కడుపులో పొడిచి పారిపోయారు. తీవ్ర రక్తస్రావం అవుతున్న సేత్యాను బస్తీవాసులు అపోలోకు తరలించారు. దుండగులంతా మద్యం, డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం ఉదయం నిందితులు ఏడుగురినీ అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారి కల్యాణంలో...
‘శ్రీరామ నీ నామం ఎంతో మధురం.. ఎంతో మధురం...’ అని ‘శ్రీరామదాసు’ చిత్రంలో నాగార్జున పాడుతుంటే థియేటర్లలో ప్రేక్షకులు భక్తి పారవశ్యంలో మునిగితేలారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ, నాగార్జున నటన... వెండితెరపై శ్రీరామ భక్తుడు రామదాసు కథను సాక్షాత్కరింపజేశాయి. ఈ కలయికలో వచ్చిన ‘అన్నమయ్య’, ‘శిరిడీ సాయి’ చిత్రాలు కూడా భక్తిపారవశ్యంలో ఊయల ఊగించాయి. తాజాగా వీరిద్దరి కలయికలో రూపొందుతున్న భక్తిరసాత్మక చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. ఈ చిత్రం కోసం అన్నపూర్ణ స్టూడియోలో తిరుమలను తలపించేలా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం సెట్ వేశారు. ఇటీవల ఈ సెట్లో శ్రీవారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కల్యాణానికి చిత్రబృందంతో పాటు సాధారణ ప్రజలూ హాజరయ్యారు. భగవంతుడి ఆశీస్సులతో కల్యాణం కన్నుల పండగగా జరిగిందని చిత్రబృందం పేర్కొంది. నాగార్జున, ఆయన సతీమణి అమల, చిత్రనిర్మాత ఎ.మహేశ్ రెడ్డి తదితరులు ఈ కల్యాణత్సవంలో పాల్గొన్నారు. అనుష్క, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో వెంకన్న భక్తుడు హాథీరాం బాబా పాత్రను నాగ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
అన్నపూర్ణ స్టూడియోకు బ్యాంకు నోటీసులు
హైదరాబాద్: తమ వద్ద రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని అన్నపూర్ణ స్టూడియోకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు రెండు జాతీయ బ్యాంకులు సోమవారం నోటీసులు జారీ చేశాయి. బంజారాహిల్స్ రోడ్ నం 2లోని అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యం ఇండియన్ బ్యాంక్‌కు రూ.32,30,60,281 కోట్లు, ఆంధ్రాబ్యాంకుకు రూ.29,76,70,292 కోట్లు బకాయి పడింది. 2014 జనవరి 2న డిమాండ్ నోటీసులు జారీ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో అన్నపూర్ణ స్టూడియో కార్యాలయంలో నోటీసులను అందజేశారు. అన్నపూర్ణ స్టూడియోకు చెందిన ఆస్తులు తమ స్వాధీనంలో ఉన్నాయని వీటిపై ఎవరూ ఎలాంటి లావాదేవీలు జరపవద్దని నోటీసుల్లో హెచ్చరించారు. -
అన్నపూర్ణ స్టూడియోకి నోటీసులు
హైదరాబాద్ : తీసుకున్న లోన్లు చెల్లించనందుకు రెండు బ్యాంకుల నుంచి అన్నపూర్ణ స్టూడియోకి లీగల్ నోటీసులు అందాయి. వివరాల ప్రకారం... సినీనటుడు నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియో రెండు బ్యాంకులకు కలిపి దాదాపు రూ.62 కోట్లు బకాయి పడింది. ఆంధ్రా బ్యాంక్‌కు రూ.29.7 కోట్లు బాకీ పడగా, ఇండియన్ బ్యాంక్‌కు రూ.32.3 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ రెండు బ్యాంకుల అధికారులు సోమవారం అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యానికి లీగల్ నోటీసులు అందజేశారు. -
పన్నెండు గంటలు...సందడే సందడి..
-
మీ కొమ్మలలోచివురులు మేమై..
-
పన్నెండు గంటలు...సందడే సందడి..
ఉత్తరాంధ్రను వణికించిన హుద్‌హుద్ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు సినీ పరిశ్రమ చేపట్టిన ‘మేము సైతం’ కార్యక్రమం ఆదివారం నాడు పన్నెండు గంటల పాటు జరిగింది. * ఉదయం 10 గంటలు దాటిన తరువాత అన్నపూర్ణా స్టూడియోలో కేవలం ప్రత్యేక ఆహ్వానితుల మధ్య ప్రారంభమైన ‘మేము సైతం’ కార్యక్రమం రాత్రి 10 గంటల వరకు సాగింది. కోటి స్వరాలు కూర్చగా, అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించిన ప్రత్యేక గీతం ‘మేము సైతం ఓ విశాఖ వాసులారా... ’ ఆలాపనతో కార్యక్రమం మొదలైంది. సీనియర్ సినీ నేపథ్య గాయని పి. సుశీల, తదితరులు కలసి ఈ గీతాన్ని ఆలపించారు. దర్శకుడు దాసరి నారాయణరావు, నటుడు మోహన్‌బాబు, బాలకృష్ణ మాట్లాడారు. ‘‘సినిమా వాళ్ళందరూ కలసి 10 కోట్ల దాకా ఇచ్చేయవచ్చు కదా అని అనవచ్చు. కానీ, బాధితులకు అండగా నిలిచి, ప్రతి ఒక్కరూ తమకు చేతనైన ఆర్థిక సాయం అందించాలన్న స్ఫూర్తి ప్రజల్లో కలిగించడా నికే ఈ కార్యక్రమం’’ అని దాసరి అన్నారు. * ‘వందేమాతర’ గీతానికీ, ‘మనం’ చిత్రంలోని ‘చిన్ని చిన్ని ఆశలు నాలో..’ పాటకు శ్రీయ డాన్స్ ఆకట్టుకుంది. * నందమూరి బాలకృష్ణ ఎవరూ ఊహించని విధంగా ఈ కార్యక్రమంలో గాయకుడిగా అవతారమెత్తారు. గాయని కౌసల్యతో కలిసి ఆయన ‘చలాకీ చూపులతో...’ పాట పాడారు. ఆ తర్వాత కొంతసేపటికి మళ్లీ వేదికపైకి వచ్చి మాళవికతో కలిసి ‘నీ కంటి చూపుల్లోన...’ పాట పాడారు. ఈ పాటలు పాడుతున్నప్పుడు బాలకృష్ణ మైక్‌ని సునాయసంగా గాల్లోకి ఎగరేసి, స్టయిల్‌కి పట్టుకోవడం, చిన్ని చిన్ని స్టెప్స్ వేయడం వీక్షకులను అలరించింది. ఈ రెండు పాటలే కాక, ఆ తర్వాత ఓ స్కిట్ కూడా చేసి, కార్యక్రమానికి నిండుదనం తీసుకు వచ్చారు. * బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్ అడపా దడపా తమదైన శైలిలో నవ్వించారు. * గాయకుడు బాబా సెహగల్ ‘గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్..’ పాట పాడి అందరిలో జోష్ నింపారు. ఈ పాట ముగింపులో పలువురు దర్శక, నిర్మాతలు వేదికపైకి వచ్చి డాన్స్ చేయడం విశేషం. స్టెప్పులేసినవాళ్లల్లో రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, డి. సురేష్‌బాబు, ఎన్వీ ప్రసాద్, కేయల్ నారాయణ తదితరులు ఉన్నారు. * మణిశర్మ, కోటి, వందేమాతరం శ్రీనివాస్, మనో, రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్, అనూప్ రూబెన్స్, సునీత, శ్రీలేఖ తదితర సంగీతదర్శకులు, గాయనీ గాయకులు పాడిన పాటలు ఓ రిలాక్సేషన్. * డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్‌తో కలిసి ఇషా చావ్లా చేసిన డాన్స్ హృదయాన్ని హత్తుకుంది. పాట చివర్లో ‘ఈసారి సాయం మాకు కాదు.. హుద్‌హుద్ బాధితులకు చేయండి’ అని వారిలోని ఒక బాలుడు అనడం ఆహూతులను కదిలించింది. * ‘మేము సైతం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు.. దక్షిణాదికి చెందిన ఇతర భాషల సినీ ప్రముఖులు కూడా విచ్చేస్తారని పేర్కొన్నారు. కానీ, వారెవరూ రాకపోవడం గమనార్హం. * మీడియాకు సైతం ప్రవేశం లేకుండా కేవలం టికెట్ కొన్నవారికే పరిమితం కావడంతో పత్రికలవారికి సమాచార సేకరణ ఇబ్బందిగా మారింది. పత్రికలకు ఫొటోలు, సమాచారం అందించే విషయంలో నిర్దుష్టమైన ప్రణాళిక, వ్యవస్థ కొరవడ్డాయి. దాదాపు 12 గంటల పాటు టీవీలో లైవ్ టెలికాస్ట్ అని ప్రకటించినప్పటికీ, ముందుగానే రికార్డు చేసిన కార్యక్రమాలను వేదిక వద్ద ప్రదర్శిస్తూ, వాటినే ‘ప్రత్యక్ష ప్రసారం’గా టీవీలో చూపారు. * మధ్యాహ్నం దాటాక కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియమ్ వేదికగా తారల మధ్య సరదా ఆటల పోటీలు జరిగాయి. మంచు విష్ణు, మనోజ్‌లు రెండు కబడ్డీ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఈ పోటీలో బ్రహ్మానందం పాల్గొనడం ఓ ఆకర్షణ. ఈ పోటీలో మంచు మనోజ్ జట్టు విజేతగా నిలిచింది. * ఇక ఎన్టీఆర్, నాగార్జున కెప్లెన్లుగా రెండు జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో నాగార్జున జట్టు గెలిచింది. ఈ మ్యాచ్‌లో నాగశౌర్య వరుసగా మూడు సిక్సర్లు కొట్టి, స్టేడియమ్లో సందడి రేపారు. * అలాగే, వెంకటేశ్, రామ్‌చరణ్ కెప్టెన్లుగా జరిగిన మ్యాచ్‌లో వెంకీ టీమ్ గెలిచింది. రామ్‌చరణ్ మూడు క్యాచ్‌లు పట్టారు. * నాకౌట్ దశలో విజయం సాధించిన రెండు జట్లతో ఫైనల్ మ్యాచ్ జరిగింది. వెంకటేశ్, నాగార్జున జట్లు పోటాపోటీగా ఆడిన నేపథ్యంలో గెలుపు నాగ్ టీమ్‌దే అయ్యింది. * ఆరు ఓవర్లకే పరిమితమైన ఈ మ్యాచ్‌లను టెన్నిస్ బంతితో ఆడారు. * మరోపక్క సాయంత్రం వేళ మళ్ళీ అన్నపూర్ణా స్టూడియోలో తారల సందడి సాగింది. ‘బాహుబలి’ బృందం వంటకం చేయడాన్ని రికార్డు చేసి, ప్రదర్శించారు. * హుద్ హుద్ తుఫాను సమయంలో కొంతమంది ప్రాణాలను కాపాడిన, సమాచార వ్యవస్థను సరి చేయడానికి పాటుపడిన కొంతమంది వ్యక్తులను ‘రియల్ హీరోస్’ పేరుతో నాగార్జున పరిచయం చేశారు. * తుషాను బాధితుల కోసం ప్రత్యేకంగా తయారు చేయించి, ఆ పాటలో అక్కినేని కుటుంబ సభ్యులు మొత్తం నటించడం విశేషం. * సాయంత్రం వేళ సందడిలో చక్రి, దేవిశ్రీ ప్రసాద్, తమన్‌లు పాటలతో అలరించారు. తమన్ ఆధ్వర్యంలో జరిగిన మ్యూజికల్ షోలో రవితేజ కొన్ని పాటలు పాడి, నర్తించారు. దేవిశ్రీ ప్రసాద్ ‘శంకర్‌దాదా జిందాబాద్...’ గీతానికి చిరంజీవి చాలా హుషారుగా స్టెప్పులు వేయడం ప్రత్యేక ఆకర్షణ అయింది. గాయకుడు మనో సారథ్యంలో సినీ నటులు పాల్గొన్న ‘అంత్యాక్షరి’ ఉత్సాహంగా సాగింది. ముఖ్యంగా చిరంజీవి, వెంకటేశ్, రాజశేఖర్, అలీ, జయప్రద తదితరులు చాలా హుషారుగా పాటలు పాడారు. * ఈ కార్యక్రమంలో మరో హైలైట్ హీరో మహేష్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను హీరోయిన్ సమంత ఇంటర్వ్యూ చేయడం. అసలు ఇద్దరు స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్‌బాబులతో మీకెలా స్నేహం కుదిరింది? అని త్రివిక్రమ్‌ని సమంత అడిగితే - ‘‘ఇద్దరికీ ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఇద్దరూ నిరాడంబరంగా ఉంటారు. మహేశ్ వార్డ్ రోబ్‌లో రెండు ప్యాంట్లు, రెండు చొక్కాలు మినహా ఉండవు. ఎంత పెద్ద కారు, ఎంత ఖరీదు గల కారులో వెళ్లాలా అని ఆలోచించడు. ఉండటానికి చిన్న ఇల్లు, చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు ఉండే చాలని మహేశ్ అనుకుంటాడు. పవన్ కల్యాణ్ కూడా చాలా సింపుల్‌గా ఉంటారు. తన దగ్గరా రెండు ప్యాంట్లు, రెండు చొక్కాలే ఉంటాయి. ఖరీదు గల కారుల్లో తిరగాలని ఆయన అనుకోరు. చుట్టూ చెట్లు, చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు ఉంటే చాలని కోరుకునే వ్యక్తి. ఇలా ఇద్దరి మనస్తత్వాలు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టే, ఇద్దరితోనూ నాకు మంచి స్నేహం కుదిరింది’’ అని చెప్పారు. -
‘స్వచ్ఛ భారత్’లో నాగార్జున కుటుంబం
హైదరాబాద్ : అక్కినేని కుటుంబం ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఇచ్చిన పిలుపు మేరకు సినీ హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నాగచైతన్య, అఖిల్, సుశాంత్ తదితరులు బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో రోడ్లను శుభ్రం చేశారు. చీపుర్లు చేతపట్టి చెత్తను ఊడ్చారు. అక్కడ పేరుకుపోయిన మట్టిని కూడా తొలగించారు. ప్రత్యేకంగా ధరించిన దుస్తులతో అక్కినేని కుటుంబం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌లను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్నందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా హీరో నాగార్జునకు అభినందనలు తెలిపారు. -
అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని అంత్యక్రియలు
-
అశ్రునయనాలతో అక్కినేని అంత్యక్రియలు
-
దుఃఖాన్ని ఆపులేకపోయిన నాగార్జున
హైదరాబాద్: తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు సందర్భంగా అక్కినేని నాగార్జున తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దుఃఖాన్ని ఆపులేకపోక భోరున ఏడ్చేశారు. అక్కినేని అంతిమయాత్ర అన్నపూర్ణ స్టూడియోకు చేరుకున్న తర్వాత నాగార్జున, వెంకట్, నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ తదితరులు పాడె ఎత్తుకుని భౌతిక కాయాన్ని చితి వద్దకు చేర్చారు. ఈ సమయంలో నాగార్జున దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు. అశ్రునయనాలతోనే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియలు జరుగుతున్నంతసేపు ఆయన దుఃఖిస్తూనేఉన్నారు. అయితే కుటుంబ సభ్యులందరూ కలిసి చితికి నిప్పటించారు. అశ్రునయనాలతో అక్కడి నుంచి వెనుదిరిగారు. తండ్రికి చివరిసారి వీడ్కోలు పలికి పుట్టెడు శోకంలో మునిగిన నాగార్జునను దాసరి నారాయణరావు, బ్రహ్మానందం గుండెలకు హత్తుకుని ఓదార్చారు. చిరంజీవి తదితరులు కూడా ఆయనను ఓదార్చారు. -
అశ్రునయనాల మధ్య అక్కినేని అంత్యక్రియలు
హైదరాబాద్: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు ఆత్మీయులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. మహానటుడికి అన్నపూర్ణ స్టూడియాలో మధ్యాహ్నం 3.30 గంటలకు అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు ఫిల్మ్ చాంబర్ నుంచి అన్నపూర్ణ స్టూడియో వరకు నిర్వహించిన నిర్వహించిన అంతిమయాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు. నాగార్జున, వెంకట్, సుమంత్, అఖిల్, సుశాంత్, నాగ చైతన్య తదితరులు పాడె ఎత్తుకుని భౌతిక కాయాన్ని చితి వద్దకు చేర్చారు. ఈ సమయంలో నాగార్జున దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబానికి చెందిన మహిళలు కూడా అంత్యక్రియలలో పాల్గొన్నారు. దాసరి నారాయణ, సుబ్బిరామిరెడ్డి, చిరంజీవి, కె. రాఘవేంద్రరావు, కృష్ణంరాజు, రాజశేఖర్, జీవిత, శ్రీదేవి, మహేశ్వరి, టబు, రమాప్రభ తదితర ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు.