బిగ్‌బాస్‌ ఫైనల్‌కు భారీ భద్రత | Strong Security At Annapurna Studios For Bigg Boss 8 Telugu Grand Finale, More Details Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్‌ ఫైనల్‌కు భారీ భద్రత

Published Thu, Dec 12 2024 7:04 AM | Last Updated on Thu, Dec 12 2024 7:18 AM

Strong Security To Bigg Boss Grand Finale

53 కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచన 

గత అనుభవాల దృష్ట్యా అడుగడుగునా నిఘా నేత్రాలు   

బంజారాహిల్స్‌: ఈ నెల 15వ తేదీన బిగ్‌బాస్‌ సీజన్‌–8 ఫైనల్‌ జరగనున్న నేపథ్యంలో ఇందుకోసం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అల్లర్లు, గొడవలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–5లోని అన్నపూర్ణ స్టూడియో ఏడెకరాల్లో బిగ్‌బాస్‌ సెట్టింగ్‌ వేయగా..ఫైనల్‌ కూడా ఇక్కడే జరగనుంది. గత ఏడాది డిసెంబర్‌ 17వ తేదీన బిగ్‌బాస్‌ సీజన్‌–7 ఫైనల్‌ సందర్భంగా తలెత్తిన పరిణామాలు, గొడవలు, బస్సులపై రాళ్లు రువ్వడం తదితర అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. 

అన్నపూర్ణ స్టూడియో చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని ఇప్పటికే పోలీసులు ఆయా పాయింట్లతో కూడిన జాబితాను అన్నపూర్ణ స్టూడియో, బిగ్‌బాస్‌ యాజమాన్యానికి అందజేశారు. గత ఏడాది ఫైనల్‌ సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడకు చేరుకున్న అభిమానులు ఒక సందర్భంలో బస్సులపై రాళ్లు రువ్వి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడగా అప్పటి బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌తో పాటు బిగ్‌బాస్, అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యంపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది.

 దాడికి పాల్పడ్డ వారిని గుర్తించడంలో పోలీసులకు చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఇక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో చాలామంది తప్పించుకున్నారు. ఈసారి ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే గుర్తించేందుకు వీలుగా బిగ్‌బాస్‌ షో జరిగే స్టూడియో చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడెక్కడ కెమెరాలు ఏర్పాటుచేయాలో జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆ పాయింట్లను బిగ్‌బాస్‌ యాజమాన్యానికి అందజేశారు. ఈ నెల 14వ తేదీన ఉదయమే వీటిని అమర్చుకోవాలని సూచించారు.  

వారంక్రితం యూసుఫ్‌గూడ స్టేడియంలో జరిగిన పుష్ప–2 ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ సందర్భంగా నిర్వాహకులు 60 తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఆ రోజు జరిగిన కార్యక్రమంలో భారీగా అభిమానులు రావడంతో 15 మొబైల్‌ ఫోన్లు, రెండు బంగారు గొలుసులు చోరీకి గురయ్యాయి. చోరులను గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్‌ సీజన్‌–8 ఫైనల్‌ సందర్భంగా కూడా చుట్టూ 53 కెమెరాలను ఏర్పాటు చేస్తే పోలీసులకు ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement