Strong Security
-
బిగ్‌బాస్ ఫైనల్‌కు భారీ భద్రత
బంజారాహిల్స్: ఈ నెల 15వ తేదీన బిగ్‌బాస్ సీజన్–8 ఫైనల్ జరగనున్న నేపథ్యంలో ఇందుకోసం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అల్లర్లు, గొడవలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–5లోని అన్నపూర్ణ స్టూడియో ఏడెకరాల్లో బిగ్‌బాస్ సెట్టింగ్ వేయగా..ఫైనల్ కూడా ఇక్కడే జరగనుంది. గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన బిగ్‌బాస్ సీజన్–7 ఫైనల్ సందర్భంగా తలెత్తిన పరిణామాలు, గొడవలు, బస్సులపై రాళ్లు రువ్వడం తదితర అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని ఇప్పటికే పోలీసులు ఆయా పాయింట్లతో కూడిన జాబితాను అన్నపూర్ణ స్టూడియో, బిగ్‌బాస్ యాజమాన్యానికి అందజేశారు. గత ఏడాది ఫైనల్ సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడకు చేరుకున్న అభిమానులు ఒక సందర్భంలో బస్సులపై రాళ్లు రువ్వి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడగా అప్పటి బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌తో పాటు బిగ్‌బాస్, అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యంపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించడంలో పోలీసులకు చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఇక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో చాలామంది తప్పించుకున్నారు. ఈసారి ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే గుర్తించేందుకు వీలుగా బిగ్‌బాస్ షో జరిగే స్టూడియో చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడెక్కడ కెమెరాలు ఏర్పాటుచేయాలో జూబ్లీహిల్స్ పోలీసులు ఆ పాయింట్లను బిగ్‌బాస్ యాజమాన్యానికి అందజేశారు. ఈ నెల 14వ తేదీన ఉదయమే వీటిని అమర్చుకోవాలని సూచించారు. వారంక్రితం యూసుఫ్‌గూడ స్టేడియంలో జరిగిన పుష్ప–2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా నిర్వాహకులు 60 తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఆ రోజు జరిగిన కార్యక్రమంలో భారీగా అభిమానులు రావడంతో 15 మొబైల్ ఫోన్లు, రెండు బంగారు గొలుసులు చోరీకి గురయ్యాయి. చోరులను గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ సీజన్–8 ఫైనల్ సందర్భంగా కూడా చుట్టూ 53 కెమెరాలను ఏర్పాటు చేస్తే పోలీసులకు ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. -
ప్లీనరీకి పటిష్ట భద్రత
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్లీనరీకి పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. విజయవాడ – గుంటూరు మధ్య జాతీయ రహదారికి సమీపంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో శుక్ర, శనివారాల్లో ప్లీనరీ జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు మంత్రులు, వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ ప్లీనరీలో పాల్గొననున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహిస్తున్న మొదటి ప్లీనరీ కావడంతో కార్యకర్తలు అంచనాలకు మించి రానున్నారు. అందుకు తగ్గట్టుగానే పోలీసు శాఖ భద్రత ఏర్పాట్లు చేసింది. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో అదనపు డీజీ (శాంతి భద్రతలు) రవిశంకర్ అయ్యన్నార్, గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, విజయవా డ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, గుంటూ రు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ అంశాలపై ప్రణాళిక రూపొందిం చారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్లీనరీ ప్రాంగణాన్ని గురువారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాదాపు 3,500 మంది పోలీసులను ప్లీనరీ భద్రతా విధుల కోసం నియమించారు. 14 మంది ఐపీఎస్ అధి కారులకు బాధ్యతలు అప్పగించారు. వీరు కాకుం డా 30 మంది డీఎస్పీలు, 120 మంది సీఐలు, 170 మంది ఎస్సైలకు విధులు కేటాయించారు. రిజర్వ్ ఫోర్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు. సీఎం హెలికాప్టర్ కోసం ప్లీనరీ వేదికకు సమీపంలో హెలి ప్యాడ్ ఏర్పాటు చేశారు. సర్వం సిద్ధం.. వీఐపీలకు ప్రత్యేక ప్రవేశ ద్వారం ప్లీనరీకి హాజరయ్యే వీఐపీల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్లీనరీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, ఇతర కేబి నెట్ హోదా కలిగిన ప్రముఖులు దాదాపు 300 మం ది వీఐపీ జాబితాలో ఉన్నారు. వారికి వీఐపీ పాస్ లు, వాహన పాస్‌లు జారీ చేశారు. వారికి ప్రత్యేక రూట్‌ను నిర్ణయించారు. నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద ఏఎన్‌యూ డైవర్షన్ పాయింట్ నుంచి అండర్‌పాస్‌లో వచ్చి వేదిక వద్దకు చేరుకోవాలి. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రధాన వేదిక ముందు ‘డి జోన్’ను ఏర్పాటు చేశారు.ఆ జోన్’లోకి ఎవరినీ అనుమతించరు. విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు ఇతర ప్రాంతాల్లో అనుమానితుల కదలికలను గుర్తించేందుకు నిఘా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గురువారం రాత్రి విద్యుత్ దీపాల ధగధగలతో కాంతులీనుతున్న ప్లీనరీ ప్రాంగణం పక్కాగా పార్కింగ్ ఏర్పాట్లు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిని ఆనుకుని ఉండే మైదానంలో ప్లీనరీ నిర్వహిస్తున్నందున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ► సీఎం కాన్వాయ్ వాహనాల పార్కింగ్: జేఎంజే స్కూల్ పార్కింగ్, సెయింట్ ఆన్స్ కాంపౌండ్. ► ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీచైర్మన్ల వాహనాలకు: బైబిల్ మిషన్ భవంతి పశ్చిమ వైపున ఉన్న ప్రదేశం. ► విజయవాడ వైపు నుంచి వచ్చే బస్సులకు: కాజా టోల్ గేట్ వద్ద ఉన్న ఆర్కే వెనుజియ లే అవుట్ వద్ద ► విజయవాడ నుంచి వచ్చే కార్లు, ఆటోలు, బైక్‌లు, స్కూటర్లకు : ఏఎన్‌యూ నార్త్, మెయిన్ గేటు, సౌత్ గేట్ల వద్ద పార్కింగ్, అయోధ్య రామిరెడ్డి – సన్స్ ఫంక్షన్ హాల్ ప్రదేశం ► గుంటూరు వైపు నుంచి వచ్చే బస్సులకు : నంబూరు, కంతేరు రోడ్డు పక్కన ► గుంటూరు వైపు నుంచి వచ్చే కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు: అమలోద్భవి హోటల్ ప్రాంగణం, జైన్ ఆలయం ప్రాంగణం, దశావతార ఆలయం ప్రాంగణం, కేశవరెడ్డి స్కూల్ ప్రాంగణం, కేశవరెడ్డి స్కూల్ వెనుక, కంతేరు రోడ్డు రైల్వే గేటు నుంచి సాయి భారతి హోం వరకు, రైల్వే గేటు దగ్గరలో సాయి భారతి హోం అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్, కంతేరు రోడ్డులో వైట్ ఫెన్సింగ్ ఖాళీ ప్రదేశం, ఎడ్ల పందేల ర్యాంప్, పల్లలమ్మ చెరువు నుండి కంతేరు రోడ్డు వరకు, ఖలీల్ దాబా వెనుక వైపు, రెయిన్ ట్రీ అపార్ట్మెంట్ సమీపంలో. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం: కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, భారీస్థాయిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు హాజరయ్యే వైఎస్సార్సీపీ ప్లీనరీ కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాం. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో మొత్తం 3,500 మంది పోలీసు సిబ్బంది భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. వీఐపీలకు అనుమతించిన వాహనాల్లో వారు మాత్రమే రావాలి. వారి అనుచరులు, కార్యకర్తలను అనుమతించరు. పోలీసులకు నేతలతో సహా అందరూ సహకరించాలి. జాతీయ రహదారి ట్రాఫిక్ మళ్లింపు ప్లీనరీ ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించే బహిరంగ సభకు లక్షలాదిగా పార్టీ శ్రేణులు హాజరుకానున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఆంక్షలుంటాయి. ► చెన్నై నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే భారీ రవాణా వాహనాలను ఒంగోలు జిల్లా త్రోవగుంట వద్ద మళ్లిస్తారు. చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ మీదుగా హనుమాన్ జంక్షన్ చేరుకోవాలి. అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం చేరుకోవచ్చు. ► చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాలి. ► చిలకలూరిపేట వైపు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు , చందోలు, చెరుకుపల్లి , భట్టిప్రోలు, పెనుమూడి వంతెన, అవనిగడ్డ మీదుగా హనుమాన్ జంక్షన్ చేరుకోవాలి. ► చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను బోయపాలెం క్రాస్ వద్ద మళ్లిస్తారు. ఉన్నం, ఏబీ పాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు , చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి వంతెన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ మీదుగా హనుమాన్ జంక్షన్ చేరుకోవాలి. ► గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్ళే వాహనాలు బుడంపాడు క్రాస్ వద్ద మళ్లిస్తారు. తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడి వంతెన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ మీదుగా హనుమాన్ జంక్షన్ చేరుకోవాలి. ► విశాఖపట్నం వైపు నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద మళ్లిస్తారు. గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా ఒంగోలు చేరుకోవాలి. ► గుంటూరు వైపు నుంచి విజయవాడ వచ్చే వాహనాలు తాడికొండ, తుళ్ళూరు, వెంకటపాలెం, యెర్రబాలెం, డాన్ బాస్కో స్కూల్, ఉండవల్లి సెంటర్, తాడేపల్లి పెట్రోల్ బంక్, వారధి మీదుగా విజయవాడ చేరుకోవాలి. ► రాజమండ్రి నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు దివాన్ చెరువు, ధవళేశ్వరం వంతెన, కొవ్వూరు, జంగారెడ్డి గూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి మీదుగా వెళ్లాలి. ► విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద మళ్లిస్తారు. ఇవి నూజివీడు, మైలవరం, జి.కొండూరు మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాలి. ► గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కేసరపల్లి, ముస్తాబాద, ఇన్నర్ రింగ్ రోడ్, పైపులరోడ్ మీదుగా ఇబ్రíహీంపట్నం చేరుకోవాలి. ► హనుమాన్ జంక్షన్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్, ఆగిరిపల్లి, జి.కొండూరు మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాలి. ► భారీ సరకు రవాణా వాహనాలు గన్నవరం, ఆగిరిపల్లి, జి.కొండూరు మీదుగా ఇబ్రహీంపట్నం వైపు వెళ్లాలి. è హైదరాబాద్ నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలు నార్కెట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ళ, అద్దంకి, మేదరమెట్ల మీదుగా చెన్నై వెళ్లాలి. ► హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే భారీ వాహనాలు ఇబ్రహీంపట్నం నుంచి జి.కొండూరు, మైలవరం, నూజివీడు మీదుగా హనుమాన్ జంక్షన్ చేరుకోవాలి. మల్టీ యాక్సిల్ రవాణా వాహనాల నిలిపివేత చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే మల్టీ యాక్సిల్ రవాణా వాహనాలను చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు వద్ద నిలిపివేస్తారు. శనివారం రాత్రి 10 గంటల తరువాత అనుమతిస్తారు. విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లే మల్టీ యాక్సిల్ రవాణా వాహనాలను హనుమాన్ జంక్షన్, పొట్టిపాడు టోల్ గేట్ వద్ద నిలిపివేసి, శనివారం రాత్రి 10 గంటల తరువాత అనుమతిస్తారు. -
కౌంటింగ్‌కు పటిష్ట భద్రత
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ లోక్‌సభ ఓట్ల లెక్కిం పు ప్రక్రియ సందర్భంగా ప టిష్ట భద్రత ఏర్పాటు చే యనున్నట్లు పోలీస్ క మిషనర్ కార్తికేయ తె లిపారు. కౌంటింగ్ నిర్వ హించే డిచ్పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ క ళాశాల (సీఎంసీ) పరిసరాల్లో 144 సెక్షన్ అమ లులో ఉంటుందని చెప్పారు. సీపీ ఆదివారం తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 23న జరగనున్న నిజామాబాద్ ఎంపీ స్థానం ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లెక్కింపు కేంద్రం వద్దకు అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది తప్ప ఇతరులను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లే అన్ని దారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని, అనుమతి ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రం వద్దకు పంపుతామన్నారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం వద్దకు రావద్దని సూచించారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీసుశాఖలోని టాస్క్‌ఫోర్స్ విభాగం 2018లో గేమింగ్, గుట్కా, ఎక్సైజ్, ఎక్స్‌ప్లోసివ్, మైనింగ్ తదితర చట్టాల కింద 493 కేసులు నమోదు చేసిందని వివరించారు. 2019లో ఇప్పటి వరకు 14 కేసులు నమోదయ్యాయని తెలిపారు. -
స్ట్రాంగ్ రూమల వద్ద మూడంచెల భద్రత
-
కలెక్టర్ల సమావేశానికి భద్రత కట్టుదిట్టం
గుంటూరు : విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని రేంజ్ డీఐజీ కేవీవీ గోపాలరావు చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురు, శుక్ర వారాల్లో జరిగే కలెక్టర్ల సమావేశానికి అన్ని రకాల ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా బుధవారం డీఐజీ గోపాలరావు, కలెక్టర్ కోన శశిధర్, అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి ఆయా ప్రాంతాల్లో పర్యటించి భద్రతా చర్యలు, పార్కింగ్ స్థలాల కేటాయింపు, గన్మెన్లు, డ్రైవర్లకు ప్రత్యేక వసతి, తదితర అంశాలపై చర్చించారు. ఇంటెలిజెన్స్ వర్గాల సూచనల మేరకు ప్రత్యేక బలగాలను సమీప ప్రాంతాల్లో మోహరించారు. అనువణువూ బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ బృందాలతో జల్లెడ పట్టారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గంలో ప్రత్యేకంగా చెక్ పోష్టులు ఏర్పాటు చేసి రెండు రోజులుగా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. పటిష్ట భద్రతను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించేందుకు మొబైల్ బృందాలను నియమించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు కలెక్టర్లు మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసు యంత్రాంగాన్ని కేటాయించారు. 400 మంది అధికారులు, సిబ్బంది హాజరుకావడంతో ఎస్పీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి వారిని బృందాల వారీగా కేటాయించి ఆయా బృందాలకు ఇన్చార్జిలుగా డీఎస్పీలను కేటాయించారు. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి ట్రాఫిక్ విధులు నిర్వహించే వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్సమస్యలు తలెత్తకుండా చూడాలని ఎస్పీ ఆదేశించారు. ముందుగానే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోష్టులతో అను సందానంగా పనిచేస్తూ ట్రాపిక్‌ను ఎప్పటికప్పుడు క్రమబద్దీకరించాలని ఆదేశించారు. కరకట్టపై రాకపోకలు నిషేధం ప్రకాశంబ్యారేజీ (తాడేపల్లి రూరల్) : మంత్రులు, ఐపీఎస్, ఐఏఎస్, రాష్ట్రంలోని ఉన్నతాధికారుల సమావేశం ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంట సీఎం నివాసం వద్ద 18, 19 తేదీల్లో జరగనుండడంతో ఉండవల్లి–అమరావతి కరకట్టపై ప్రకాశంబ్యారేజి నుంచి అప్పారావు గెస్ట్‌హౌస్ వరకు రాకపోకలను నిషేధిస్తున్నట్లు నార్త్‌జోన్ డీఎస్పీ గోగినేని రామాంజనేయులు తెలిపారు. బుధవారం ప్రకాశంబ్యారేజి ఔట్‌పోస్ట్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన 250 మంది అధికారులతో పాటు అదనంగా మరో 250 మంది ఈ సమావేశానికి హాజరవుతున్నారు. వీరందరూ లోటస్ఫుడ్సిటీ నుండి సీఎం నివాసానికి వెళ్లేందుకు జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారన్నారు. రాజధానిలోని 29 గ్రామాల ప్రజలతో పాటు ఉండవల్లి, పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. సమావేశాలను జయప్రదం చేయండి ఉండవల్లి (తాడేపల్లి రూరల్): ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంట సీఎం నివాసం వద్ద ఉన్న గ్రీవెన్స్ బిల్డింగ్‌లో 18,19 తేదీల్లో మొట్టమొదటిసారిగా జరిగే ఐపీఎస్, ఐఏఎస్, మంత్రివర్గ సమావేశాల జయప్రదానికి అందరూ కృషిచేయాలని కలెక్టర్ కోన శశిధర్ సూచించారు. బుధవారం సీఎం నివాసం వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మిగతా శాఖ అధికారులు, మంత్రి వర్గ అనుచరులకు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారు కూడా సీఎం నివాసం వద్దే కూర్చునేందుకు షెల్టర్, భోజనం ఏర్పాటు చేయాలని ఆయన జిల్లా అధికారులకు సూచించారు. అర్బన్ ఎస్.పి. విజయరావు కనకదుర్గ వారధి దగ్గర నుంచి ప్రకాశంబ్యారేజీ మీద, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి, కరకట్ట ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో మంగళగిరి నార్త్‌జోన్ డీఎస్పీ గోగినేని రామాంజనేయులు, మంగళగిరి రూరల్, పట్టణ సీఐలు మధు, హరికృష్ణ, ఎస్సైలు ప్రతాప్‌కుమార్, వినోద్‌కుమార్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఛలో అసెంబ్లీ భగ్నానికి పటిష్ట భద్రత.
-
ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు
కాళ్ల : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం జిల్లాకు రానున్న సందర్భంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యేలు వేటుకూరి శివ, కలెక్టర్ కె.భాస్కర్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. మోడి గ్రామంలో హెలిఫాడ్, కలవపూడి హైస్కూల్ ప్రాంగణంలో సభా వేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో సీఎం పర్యటన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశా రు. శనివారం ఉదయం 10 గంటలకు హెలికాఫ్టర్‌లో మోడి గ్రామానికి వస్తారు. అక్కడ ఆయన మొగదిండి స్ట్రయిట్ కట్ డ్రెయిన్‌లో కిక్కిస కోసే యంత్రాన్ని ప్రా రంభిస్తారు. అనంతరం ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్‌ను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం కలవపూడి హైస్కూ ల్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ నీరు-చెట్టు, స్వచ్ఛభారత్, పొలం పిలుస్తోంది కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొం టారు. అనంతరం పశువుల ఆసుపత్రిని ప్రారంభిస్తారు. మోడల్ స్కూల్‌గా ఎంపికైన కలవపూడి జెడ్పీ హైస్కూల్‌ను సందర్శిస్తారు. హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభావేదిక నుంచి చంద్రబాబు ప్రసంగిస్తారు. సభ అనంతరం మోడీ నుంచి హెలికాఫ్టర్‌లో పాలకొల్లు నియోజకవర్గ పర్యటనకు వెళతారు. సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు ఎస్పీ కె.రఘురామిరెడ్డి ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్టు ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి తెలిపారు. 17 మంది డీఎస్పీలు, 49 మంది సీఐలు, 116 మంది ఎస్సైలు, 185 మంది ఏఎస్సైలు, 300 హెడ్ కానిస్టేబుళ్లు, 830 మంది కానిస్టేబుళ్లు, ఉమెన్ హెడ్ కానిస్టేబుళ్లు 100 మంది, స్పెషల్ పార్టీ 8 మంది, ఏఎఆర్ ప్లాటిన్లు 6, 30 మంది స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కలిపి మొత్తం 1500 మంది పోలీసులను బందోబస్తుకు నియమించామనిఎస్పీ తెలిపారు. దొడ్డిపట్లలో ఏర్పాట్లు పూర్తి దొడ్డిపట్ల (యలమంచిలి) : దొడ్డిపట్లలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత పరిశీలించారు. సీఎం పర్యటనకు దొడ్డిపట్లలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. మంత్రి పీతల సుజాతతో పాటు రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సుజాత విలేకరులతో మాట్లాడుతూ పేదరికంపై గెలుపే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రవాస భారతీయులను జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ద్వారా ఉత్తేజపరచి గ్రామాల్లో వారి సేవలను వినియోగించాలనే ధ్యేయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. హుదూద్ తుపాను కారణంగా జన్మభూమి కార్యక్రమం వాయిదా పడడంతో గత నెలలో పింఛన్లు ఇవ్వలేని వారికి ఈ నెలలో రెండు నెలల పింఛన్లు కలిపి ఇస్తామన్నారు. కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ గత నెలలో గ్రామ కమిటీలు నుంచి వచ్చిన పింఛన్ అర్జీలలో 45 వేల మందికి ఈ నెల కొత్త పింఛన్లు మంజూరు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తొలిసారిగా నియోజకవర్గానికి వస్తున్న ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి కార్యకర్తలంతా తరలిరావాలని కోరారు. సీఎం ఇలపకుర్రు హైస్కూల్ గ్రౌండ్లో హెలికాఫ్టర్ దిగి అక్కడి నుంచి ఇలపకుర్రు పంచాయతీ కుమ్మరపాలెంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించే పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. దొడ్డిపట్లలో ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డిపట్ల హైస్కూల్ గ్రౌండ్లో జరిగే జన్మభూమి-మా ఊరు సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని చెప్పారు. -
దుర్భేద్యంగా రైసినా హిల్స్
మోడీ ప్రమాణానికి అసాధారణ భద్రత రిపబ్లిక్ డే పరేడ్ స్థారుులో ఏర్పాట్లు యూంటీ ఎరుుర్క్రాఫ్ట్ గన్లు, షార్ప్ షూటర్ల మోహరింపు న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని అత్యంత కట్టుదిట్టుమైన భద్రత మధ్య ఉండే రాష్ట్రపతి భవన్‌ను మరింత పటిష్ట రక్షణ ఏర్పాట్లతో దుర్భేద్యంగా మారుస్తున్నారు. గణతంత్ర దిన పరేడ్‌కు చేపట్టే భద్రతా ఏర్పాట్లకు సరిసమాన స్థారుులో ఇటు భూమి అటు గగనతలాన్ని పకడ్బందీగా పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు. మోడీ సోమవారం రాష్ట్రపతి భవన్ ఆవరణలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి పొరుగు దేశాలకు చెందిన ఉన్నతస్థారుు నేతలతో పాటు ఎంపిక చేసిన మరో 3 వేల మంది అతిథులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో 26న న్యూఢిల్లీని హైఅలర్ట్ ప్రాంతంగా ప్రకటిస్తారు. రైసినా హిల్స్(రాష్ట్రపతి భవన ప్రాంగణ ప్రాంతం) చుట్టూ బహుళ అంచెల భద్రతా వలయూన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. రాష్ట్రపతి భవన్ చుట్టుపక్కల కార్యాలయూలన్నిటినీ మధ్యాహ్నం ఒంటిగంట నుంచే మూసివేసి బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. 5,000 మంది భద్రతా సిబ్బందిని వినియోగించనున్నారు. ఇటు భూమి అటు ఆకాశం వైపునుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నారు. తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులు చేసే ద్రోన్ విమానాలను దృష్టిలో ఉంచుకుని వైమానిక భద్రతను పటిష్టం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసు కమాండోలతో పాటు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్లు, జాతీయ భద్రతా దళానికి చెందిన షార్ప్ షూటర్లను కూడా మోహరిస్తున్నారు. చుట్టుపక్కల ఎత్తై భవనాలపై కమాండోలను మోహరించనున్నారు. డాగ్, బాంబ్ స్క్వాడ్లు పరిసరాలన్నిటినీ తమ అధీనంలోకి తీసుకుంటారుు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేరుు మాదిరిగా ఎక్కువమంది వీక్షించేలా రాష్ట్రపతి భవన్ ముందు ప్రమాణం చేయూలని మోడీ నిర్ణరుుంచడం తెలిసిందే. మోడీ భద్రతకు ఉమ్మడి నిఘా హైదరాబాద్: ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న మోడీకి భద్రతను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా కేంద్ర నిఘా సంస్థలైన ఇంటలిజెన్స్ బ్యూరో , రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ దేశ చరిత్రలో తొలిసారిగా ఉమ్మడి నిఘా బృందాలను ఏర్పాటు చేశాయి. అల్పాహారంలో ఢోక్లా: ప్రమాణం తరువాత అతిథులకు అందించే అల్పాహారాన్ని రాష్ట్రపతి భవన్ వంట సిబ్బందితో పాటు ఐటీడీసీ, హైదరాబాద్ హౌస్ సిబ్బంది కలిసి తయారుచేస్తారు. మోడీ గుజరాతీ నేపథ్యం దృష్ట్యా ఢోక్లాను చేర్చారు. విదేశీ అతిథుల కోసం కబాబ్‌లను వడ్డిస్తారు. భార్యగా నన్ను గుర్తించారు: జశోదాబెన్ అహ్మదాబాద్: ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన భార్య జశోదాబెన్ ఆనందంలో మునిగితేలుతున్నారు. దేశ పగ్గాలు చేపట్టే స్థాయికి తన భర్త ఎదిగినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని ఓ చానల్‌కు చెప్పారు. అలాగే భార్యగా తనను తొలిసారి అంగీకరించినందుకు ఆయనకు రుణపడి ఉంటానన్నారు. ‘దేశ సేవ కోసం ఆయన కుటుంబాన్ని వీడాల్సి రావడం వల్ల విడిగా ఉంటున్నాం తప్పితే మేం విడాకులు తీసుకునే తరహాలో వేరుపడలేదు. ప్రమాణస్వీకారానికి ఆహ్వానం అందితే తప్పకుండా వెళ్తా’’ అని అన్నారు. -
స్ట్రాంగ్ భద్రత
అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ :ప్రాదేశిక పోరులో ఓటరు తీర్పును దాదాపు నెల రోజుల పాటు కాపు కాసేందుకు పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్యాలట్ బాక్సులు భద్రపరిచిన ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. 40 మంది సాయుధ పోలీసులు పహారా కాస్తున్నారు. మే 13న ఓట్ల లెక్కింపు వరకు బ్యాలట్ బాక్సులను భద్రపరచనున్నారు.అమలాపురం, రామచంద్రపురం, రంపచోడవరం డివిజన్లలో రెండు విడతలో శుక్రవారం జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బ్యాలట్ బాక్సులను పోలీసు బందోబస్తు నడుమ ఆయా ప్రాంతాల నుంచి స్ట్రాంగ్ రూంలకు తరలించారు. అమలాపురం డివిజన్లోని బ్యాలట్ బాక్సులను అమలాపురం కిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల, పరంజ్యోతి పబ్లిక్ స్కూల్లోని స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచారు. రామచంద్రపురం డివిజన్లోని 8 మండలాలకు సంబంధించిన బ్యాలట్ బాక్సులను వీఎస్ఎం కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో, రంపచోడవరం డివిజన్లోని 7 మండలాల బ్యాలట్ బాక్సులను బొర్నగూడెంలోని స్ట్రాంగ్ రూంకు తరలించారు. అమలాపురం డివిజన్లోని అల్లవరం, రాజోలు, అమలాపురం, ఉప్పలగుప్తం, మామిడికుదురు, మలికిపురం, కాట్రేనికోన, సఖినేటిపల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల బ్యాలట్ బాక్సులను మండలానికి ఓ గది చొప్పున కిమ్స్‌లోని స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచారు. పరంజ్యోతి పబ్లిక్ స్కూల్లో పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల బ్యాలట్ బాక్సులను ఉంచారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఈ రెండు కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూంలకు ఆయా మండలాల ఆర్ఓలు, ఏఆర్‌ఓల సమక్షంలో అమలాపురం రూరల్ సీఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, పట్టణ సీఐ సీహెచ్ శ్రీనివాసబాబు సీలు వేశారు. సాయుధ బలగాలతో 24గంటల భద్రత అమలాపురంలోని కిమ్స్ కళాశాల, పరంజ్యోతి స్కూల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఆయా విద్యా సంస్థల సిబ్బందిని కూడా రావద్దని ఆదేశాలు జారీ చేశారు. స్ట్రాంగ్ రూంలకు రిజర్వ్ సాయుధ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విడతల వారీగా షిఫ్ట్‌కు 20 మంది చొప్పున 24 గంటలూ భద్రత కల్పిస్తున్నారు. అమలాపురం డీఎస్పీ ఎం.వీరారెడ్డి, సీఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో రంపచోడవరంలోని బొర్నగూడెం స్ట్రాంగ్ రూంకు అదనంగా 15 మంది భద్రత సిబ్బందిని ఎన్నికల అధికారులు కేటాయించారు.