దుర్భేద్యంగా రైసినా హిల్స్ | strong Security Raisina Hills | Sakshi
Sakshi News home page

దుర్భేద్యంగా రైసినా హిల్స్

Published Sat, May 24 2014 1:18 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

దుర్భేద్యంగా రైసినా హిల్స్ - Sakshi

దుర్భేద్యంగా రైసినా హిల్స్

మోడీ ప్రమాణానికి అసాధారణ భద్రత
రిపబ్లిక్ డే పరేడ్ స్థారుులో ఏర్పాట్లు
యూంటీ ఎరుుర్‌క్రాఫ్ట్ గన్‌లు, షార్ప్ షూటర్ల మోహరింపు

 
న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని అత్యంత కట్టుదిట్టుమైన భద్రత మధ్య ఉండే రాష్ట్రపతి భవన్‌ను మరింత పటిష్ట రక్షణ ఏర్పాట్లతో దుర్భేద్యంగా మారుస్తున్నారు. గణతంత్ర దిన పరేడ్‌కు చేపట్టే భద్రతా ఏర్పాట్లకు సరిసమాన స్థారుులో ఇటు భూమి అటు గగనతలాన్ని పకడ్బందీగా పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు. మోడీ సోమవారం రాష్ట్రపతి భవన్ ఆవరణలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి పొరుగు దేశాలకు చెందిన ఉన్నతస్థారుు నేతలతో పాటు ఎంపిక చేసిన మరో 3 వేల మంది అతిథులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో 26న న్యూఢిల్లీని హైఅలర్ట్ ప్రాంతంగా ప్రకటిస్తారు. రైసినా హిల్స్(రాష్ట్రపతి భవన ప్రాంగణ ప్రాంతం) చుట్టూ బహుళ అంచెల భద్రతా వలయూన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. రాష్ట్రపతి భవన్ చుట్టుపక్కల కార్యాలయూలన్నిటినీ మధ్యాహ్నం ఒంటిగంట నుంచే మూసివేసి బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. 5,000 మంది భద్రతా సిబ్బందిని వినియోగించనున్నారు. ఇటు భూమి అటు ఆకాశం వైపునుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నారు. తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులు చేసే ద్రోన్ విమానాలను దృష్టిలో ఉంచుకుని వైమానిక భద్రతను  పటిష్టం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసు కమాండోలతో పాటు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌లు,  జాతీయ భద్రతా దళానికి చెందిన షార్ప్ షూటర్లను కూడా మోహరిస్తున్నారు. చుట్టుపక్కల ఎత్తై  భవనాలపై కమాండోలను మోహరించనున్నారు. డాగ్, బాంబ్ స్క్వాడ్‌లు పరిసరాలన్నిటినీ తమ అధీనంలోకి తీసుకుంటారుు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేరుు మాదిరిగా ఎక్కువమంది వీక్షించేలా రాష్ట్రపతి భవన్ ముందు ప్రమాణం చేయూలని మోడీ నిర్ణరుుంచడం తెలిసిందే.

మోడీ భద్రతకు ఉమ్మడి నిఘా

హైదరాబాద్: ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న మోడీకి భద్రతను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా కేంద్ర నిఘా సంస్థలైన ఇంటలిజెన్స్ బ్యూరో , రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ దేశ చరిత్రలో తొలిసారిగా ఉమ్మడి నిఘా బృందాలను ఏర్పాటు చేశాయి.

 అల్పాహారంలో ఢోక్లా: ప్రమాణం తరువాత అతిథులకు అందించే అల్పాహారాన్ని రాష్ట్రపతి భవన్ వంట సిబ్బందితో పాటు ఐటీడీసీ, హైదరాబాద్ హౌస్ సిబ్బంది కలిసి తయారుచేస్తారు. మోడీ గుజరాతీ నేపథ్యం దృష్ట్యా ఢోక్లాను చేర్చారు.  విదేశీ అతిథుల కోసం కబాబ్‌లను వడ్డిస్తారు.

భార్యగా నన్ను గుర్తించారు: జశోదాబెన్

అహ్మదాబాద్: ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన భార్య జశోదాబెన్ ఆనందంలో మునిగితేలుతున్నారు. దేశ పగ్గాలు చేపట్టే స్థాయికి తన భర్త ఎదిగినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని ఓ చానల్‌కు చెప్పారు. అలాగే భార్యగా తనను తొలిసారి అంగీకరించినందుకు ఆయనకు రుణపడి ఉంటానన్నారు. ‘దేశ సేవ కోసం ఆయన కుటుంబాన్ని వీడాల్సి రావడం వల్ల విడిగా ఉంటున్నాం తప్పితే మేం విడాకులు తీసుకునే తరహాలో వేరుపడలేదు. ప్రమాణస్వీకారానికి ఆహ్వానం అందితే తప్పకుండా వెళ్తా’’ అని అన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement