
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగగా రెండు సినిమా సెట్టింగులు కాలిపోయాయి. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది కాస్త ఆలస్యంగా చేరుకోగా.. 4 ఫైరింజన్ల సిబ్బంది మంటలు అదుపు చేసే యత్నం చేస్తున్నారు.
ప్రమాదానికి గల కారణాలు.. నష్టం... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ స్టూడియో అక్కినేని కుటుంబానికి చెందిందని తెలిసిందే. సినిమాలతోపాటు పలు సీరియళ్లు, రియాల్టీ షోలు ఇక్కడ షూటింగులు జరుపుకుంటాయి. ఘటన గురించి తెలియగానే హుటాహుటిన అక్కడి చేరుకున్న నాగ్ మీడియాతో మాట్లాడారు. నాగేశ్వరావుగారి జ్ఞాపకార్థం నిలుపుకున్న మనం సినిమా సెట్‌తోపాటు.. చిరు సైరా నరసింహారెడ్డి కోసం వేసిన ఓ సెట్ కాలిపోయినట్లు చెప్పారు. అయితే ప్రమాదంలో ఎవరికీ ఏ హాని కలగకపోవటం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment