నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు ఆత్మీయులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. మహానటుడికి అన్నపూర్ణ స్టూడియాలో మధ్యాహ్నం 3.30 గంటలకు అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు ఫిల్మ్ చాంబర్ నుంచి అన్నపూర్ణ స్టూడియో వరకు నిర్వహించిన నిర్వహించిన అంతిమయాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు.