అశ్రునయనాల మధ్య అక్కినేని అంత్యక్రియలు | Akkineni Nageswara Rao last rites performed | Sakshi
Sakshi News home page

అశ్రునయనాల మధ్య అక్కినేని అంత్యక్రియలు

Published Thu, Jan 23 2014 3:39 PM | Last Updated on Thu, May 24 2018 12:20 PM

అశ్రునయనాల మధ్య అక్కినేని అంత్యక్రియలు - Sakshi

అశ్రునయనాల మధ్య అక్కినేని అంత్యక్రియలు

హైదరాబాద్: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు ఆత్మీయులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. మహానటుడికి అన్నపూర్ణ స్టూడియాలో మధ్యాహ్నం 3.30 గంటలకు అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు ఫిల్మ్ చాంబర్ నుంచి అన్నపూర్ణ స్టూడియో వరకు నిర్వహించిన నిర్వహించిన అంతిమయాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు.

నాగార్జున, వెంకట్, సుమంత్, అఖిల్, సుశాంత్, నాగ చైతన్య తదితరులు పాడె ఎత్తుకుని భౌతిక కాయాన్ని చితి వద్దకు చేర్చారు. ఈ సమయంలో నాగార్జున దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబానికి చెందిన మహిళలు కూడా అంత్యక్రియలలో పాల్గొన్నారు.

దాసరి నారాయణ, సుబ్బిరామిరెడ్డి, చిరంజీవి, కె. రాఘవేంద్రరావు, కృష్ణంరాజు, రాజశేఖర్, జీవిత, శ్రీదేవి, మహేశ్వరి, టబు, రమాప్రభ తదితర ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement