దుఃఖాన్ని ఆపులేకపోయిన నాగార్జున | Akkineni Nagarjuna broke into tears at last rites | Sakshi
Sakshi News home page

దుఃఖాన్ని ఆపులేకపోయిన నాగార్జున

Published Thu, Jan 23 2014 4:08 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

దుఃఖాన్ని ఆపులేకపోయిన నాగార్జున - Sakshi

దుఃఖాన్ని ఆపులేకపోయిన నాగార్జున

హైదరాబాద్: తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు సందర్భంగా అక్కినేని నాగార్జున తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దుఃఖాన్ని ఆపులేకపోక భోరున ఏడ్చేశారు. అక్కినేని అంతిమయాత్ర అన్నపూర్ణ స్టూడియోకు చేరుకున్న తర్వాత నాగార్జున, వెంకట్, నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ తదితరులు పాడె ఎత్తుకుని భౌతిక కాయాన్ని చితి వద్దకు చేర్చారు. ఈ సమయంలో నాగార్జున దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు. అశ్రునయనాలతోనే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

అంత్యక్రియలు జరుగుతున్నంతసేపు ఆయన దుఃఖిస్తూనేఉన్నారు. అయితే కుటుంబ సభ్యులందరూ కలిసి చితికి నిప్పటించారు. అశ్రునయనాలతో అక్కడి నుంచి వెనుదిరిగారు. తండ్రికి చివరిసారి వీడ్కోలు పలికి పుట్టెడు శోకంలో మునిగిన నాగార్జునను దాసరి నారాయణరావు, బ్రహ్మానందం గుండెలకు హత్తుకుని ఓదార్చారు. చిరంజీవి తదితరులు కూడా ఆయనను ఓదార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement