‘చి ల సౌ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Sushanth Starrer Chi La Sow Movie Will Be Released On July 27 | Sakshi
Sakshi News home page

‘చి ల సౌ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Tue, Jul 10 2018 11:59 AM | Last Updated on Tue, Jul 10 2018 12:02 PM

Sushanth Starrer Chi La Sow Movie Will Be Released On July 27 - Sakshi

సుశాంత్‌ హీరోగా నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘చి ల సౌ’.. హృద్యమైన ప్రేమకథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాను జూలై 27న అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ సినిమాతో రుహానీ శర్మ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సిరుని సినీ కార్పొరేషన్‌ పతాకంపై జస్వంత్‌ నడిపల్లి, భరత్‌ కుమార్‌ మలశాల, హరి పులిజల ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమా విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు హీరో సుశాంత్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement