సుశాంత్‌కు రానా సహాయం! | Will Rana Release Chi La Sow Movie Teaser | Sakshi
Sakshi News home page

Published Sun, May 6 2018 1:55 PM | Last Updated on Sun, May 6 2018 1:55 PM

Will Rana Release Chi La Sow Movie Teaser - Sakshi

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుశాంత్‌. కరెంట్‌ సినిమాతో విజయాన్ని సాధించినా, ఈ మధ్యకాలంలో సరైన హిట్‌ రాలేదు. సుశాంత్‌ చివరగా ‘ఆటాడుకుందాం రా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అది కూడా నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం సుశాంత్‌, రాహుల్‌ రవీంద్రన్‌ డైరెక్షన్‌లో చి.ల.సౌ సినిమాలో నటిస్తున్నారు. 

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పొస్టర్‌ను ఈ మధ్యే రిలీజ్‌ చేశారు. మే 7న టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. రానా దగ్గుబాటి ఈ సినిమా టీజర్‌ను లాంచ్‌ చేయబోతున్నాడని తెలుస్తోంది. హీరోగా ఉన్న రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా మారి తీస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement