‘స్వచ్ఛ భారత్’లో నాగార్జున కుటుంబం | 'swechha bhrath 'Nagarjuna in the family | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛ భారత్’లో నాగార్జున కుటుంబం

Published Mon, Oct 27 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

‘స్వచ్ఛ భారత్’లో  నాగార్జున కుటుంబం

‘స్వచ్ఛ భారత్’లో నాగార్జున కుటుంబం

హైదరాబాద్ : అక్కినేని కుటుంబం ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఇచ్చిన పిలుపు మేరకు సినీ హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నాగచైతన్య, అఖిల్, సుశాంత్ తదితరులు బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో  రోడ్లను శుభ్రం చేశారు. చీపుర్లు చేతపట్టి చెత్తను ఊడ్చారు. అక్కడ పేరుకుపోయిన మట్టిని కూడా తొలగించారు.

ప్రత్యేకంగా ధరించిన దుస్తులతో అక్కినేని కుటుంబం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌లను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్నందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా హీరో నాగార్జునకు అభినందనలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement