అక్కినేని ఫ్యామిలీలో మరికొన్ని గంటల్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య.. బుధవారం రాత్రి 8:13 గంటల ముహూర్తానికి శోభిత మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలోని ఈ వేడుక జరగనుంది.
(ఇదీ చదవండి: 'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్)
నాగార్జున-లక్ష‍్మిల కుమారుడైన నాగచైతన్య.. ధూళిపాళ శాంతకామాక్షి, వేణుగోపాలరావుల కుమార్తె అయిన శోభితతో ఏడడుగులు నడవబోతున్నాడు. ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగనుంది. టాలీవుడ్ నుంచి కూడా మెగా, దగ్గుబాటి కుటుంబాలు రాబోతున్నాయి. రాజమౌళి, మహేష్, ప్రభాస్ తదితర స్టార్ హీరోలు కూడా ఈ పెళ్లికి విచ్చేయనున్నారు.
(ఇదీ చదవండి: నిఖిల్‌ని ఓడించిన ప్రేరణ.. సారీ చెప్పిన గౌతమ్)
Comments
Please login to add a commentAdd a comment