శోభిత... అక్కినేని ఇంటి కోడలైంది. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్యని ఇటీవలే పెళ్లి చేసుకుంది. తర్వాత భర్త, మామతో కలిసి శ్రీశైల మల్లిఖార్జునుడిని కూడా దర్శించుకుంది. గత కొన్నిరోజులుగా పెళ్లి పనులతో బిజీగా ఉన్న శోభిత.. కాస్త తీరిక దొరకడంతో భర్త, పెళ్లి తర్వాత జీవితం గురించి మాట్లాడింది.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ యాక్టర్స్)
'చైతన్య.. నా జీవితంలోకి రావడం అదృష్టం. చైతూ సింప్లిసిటీ, అందరితో గౌరవంగా ఉండే విధంగా నాకు ఎంతో నచ్చేశాయి. ప్రేమలో ఆత్మీయత ఎక్కువగా ఉండాలనేది చైతూ నుంచి నేను నేర్చుకున్నాను. పెళ్లి తర్వాత శ్రీశైలం వెళ్లి శివుడిని దర్శించుకోవడం ఎంతో ప్రశాంతనిచ్చింది. చిన్నప్పటి నుంచి నా జీవితంలో దైవభక్తి భాగమే. టైమ్ దొరికినప్పుడల్లా కూచిపూడి, భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తుంటాను. వంట విషయంలోనూ ప్రాక్టీస్ ఉంది. ఆవకాయ, ముద్దపప్పు చేయడమంటే చాలా ఇంట్రెస్ట్' అని శోభిత చెప్పుకొచ్చింది.
నాగచైతన్య హీరోగా నటించిన 'తండేల్'.. రాబోయే ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఈ నెల నుంచి 'విరూపాక్ష' దర్శకుడు తీసే కొత్త సినిమాలోనూ చైతూ నటించబోతున్నాడు. శోభిత విషయానికొస్తే ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లు ఏవి లేనట్లు కనిపిస్తున్నాయి. కొన్నాళ్ల పాటు పెళ్లి జీవితాన్ని ఆస్వాదించి ఆ తర్వాత తిరిగి సినిమాలు-వెబ్ సిరీసులు చేస్తుందేమో!
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment