చైతన్య రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 21న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ సోమవారం ప్రకటించింది.
ఈ సందర్భంగా యష్ రంగినేని మాట్లాడుతూ– ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిది. చెందు ముద్దు ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా రూపొందించారు. 80 దశకం నేపథ్యంతో పీరియాడిక్ సినిమాగా సాగుతుంది. మా సంస్థకు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రి¯Œ ్స హెన్రీ, కెమెరా: పంకజ్ తొట్టాడ.
Comments
Please login to add a commentAdd a comment