‘‘ప్రేక్షకులకు మనం ఎప్పటి కథ చెబుతున్నామన్నది ముఖ్యం కాదు. ఆ కథను ఎలా చెబుతున్నామన్నదే ముఖ్యం. ‘సీతారామం’ సినిమా 1960ల నేపథ్యంలో ఉన్నా ప్రేక్షకులు ఆదరించారు. అందుకే 1980ల నేపథ్యంలో రూ΄÷ందిన మా ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ కూడా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు
చెందు ముద్దు అన్నారు.
చైతన్యా రావ్, లావణ్య జంటగా యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు చెందు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రం ‘ఓ పిట్ట కథ’. ఇప్పుడు ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ తీశాను. ఈ చిత్రంలో ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను వినోదాత్మకంగా చూపిస్తున్నాం. మాలాంటి కొత్త వాళ్లను ప్రేక్షకులు ్ర΄ోత్సహించినప్పుడే మరిన్ని కొత్త సినిమాలు వస్తాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment